E-Paper
Advertisement

ఏఎంబీ సినిమాస్‌లో నమ్రత, సితారలతో పాటు ప్రియాంక చోప్రా సందడి.. వైరల్ అవుతున్న పిక్స్..

ఏఎంబీ సినిమాస్‌లో నమ్రత, సితారలతో పాటు ప్రియాంక చోప్రా సందడి.. వైరల్ అవుతున్న పిక్స్..
Advertisement

Priyanka Hyderabad: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హైదరాబాద్‌లో మహేష్ బాబుతో కలిసి నటిస్తున్న తన రాబోయే చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ బిజీ షెడ్యూల్ మధ్య, ఆమె కొంచెం సమయం కేటాయించి హైదరాబాద్‌లోని మహేష్ బాబుకు చెందిన ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ ‘ఏఎంబీ సినిమాస్’ (AMB Cinemas) ను సందర్శించారు. ఈ సందడిలో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేని కూడా ప్రియాంకతో జతకలిశారు. వీరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read also-హీరో ఉపేంద్ర ఇంట సంబరాలు.. కొడుకు ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..

ఏఎంబీ సినిమాస్ పోస్ట్

Advertisement

ఏఎంబీ సినిమాస్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రియాంక, నమ్రత, సితారలు అక్కడి సిబ్బందితో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. “ఉత్తమమైన ప్రదేశాన్ని ఉత్తమమైన వారే సందర్శిస్తారని చెప్పడానికి ఇదే నిదర్శనం. పర్‌ఫెక్ట్ మూవీ ఎక్స్‌పీరియన్స్ కోసం ఒకే ఒక డెస్టినేషన్.. కొన్ని అనుభవాలు కేవలం ఏఎంబీ సినిమాస్ లోనే సాధ్యమవుతాయి. మా ‘మందాకిని’ ప్రియాంక చోప్రా, నమ్రత శిరోద్కర్, సితార ఘట్టమనేనిలతో కలిసి ఏఎంబీ సినిమాస్ మరింత ప్రకాశిస్తోంది” అంటూ రాసుకొచ్చింది.

ఈ అవుటింగ్ కోసం ప్రియాంక చోప్రా బ్లాక్ పోల్కా-డాట్ డ్రెస్‌లో ఎలిగెంట్‌గా కనిపించగా, నమ్రత సింపుల్ అండ్ క్లాసీ ఆఫ్-వైట్ కో-ఓర్డ్ సెట్‌లో కనిపించారు. సితార కూడా క్యాజువల్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంది. ముగ్గురూ నవ్వుతూ కెమెరాకు పోజులిచ్చారు.

అభిమానుల స్పందన

Advertisement

ఈ ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు బ్యూటీ క్వీన్స్ (మిస్ వరల్డ్ పోటీదారు ప్రియాంక, మిస్ ఇండియా నమ్రత) ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. “ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు అంతర్జాతీయ స్థాయి అందాల తారలను చూడటం చాలా ఆనందంగా ఉంది” అని ఒకరు కామెంట్ చేయగా.. “అంతా సరే, ఇంతకీ మహేష్ బాబు ఎక్కడ?” అని మరికొందరు సరదాగా ప్రశ్నించారు.

‘వారణాసి’ విశేషాలు

దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా ‘వారణాసి’ సినిమాతో భారతీయ వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా చిత్రంలో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్త విజయం తర్వాత రాజమౌళి చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇది. సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో టైమ్-ట్రావెల్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.

Read also-మహేష్ బాబు నెక్స్ట్ సినిమా దర్శకుడు ఆయనేనా?.. అయితే మాత్రం ఫ్యాన్స్‌కు పండగే..

ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అందిస్తున్న ప్రముఖ సంస్థ ‘సినీసైట్’ (Cinesite) తమ వెబ్‌సైట్‌లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చిన్న సారాంశాన్ని చేర్చింది. దాని ప్రకారం: “ఒక శివ భక్తుడు అమితమైన శక్తి కలిగిన ఒక బ్రహ్మాండమైన కాస్మిక్ వస్తువును కనుగొనడానికి శతాబ్దాలుగా దాగి ఉన్న రహస్యాలను ఛేదిస్తూ కాలంలో ప్రమాదకరమైన ప్రయాణం చేస్తాడు. అయితే ఈ మిషన్ వెనుక ఉన్న అసలు నిజం.. ప్రపంచాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకునే ఒక మాస్టర్‌మైండ్ ప్లాన్ అని అతను గ్రహిస్తాడు.” అదే సినిమా సారాశం.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×