E-Paper
Advertisement

Prakasam Crime: మార్కాపురంలో దారుణం.. వృద్ధురాలిపై యువకుడి అఘాయిత్యం..

Prakasam Crime: మార్కాపురంలో దారుణం.. వృద్ధురాలిపై యువకుడి అఘాయిత్యం..
Advertisement

Prakasam Crime: ఆడపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన క్రూరులను న్యాయస్థానాలు ఎంత కఠినంగా శిక్షించినా.. మిగతా వారిలో ఏ కోశాన కించిత్ మార్పు రావడం లేదు. చిన్నపిల్ల నుంచి పండు ముసలి వరకూ.. ఆడతనం ఉంటే చాలు అనుకుంటూ.. ఇష్టారీతిన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

మద్యంమత్తులో కళ్లుమూసుకుపోయిన ఒక కామాంధుడు.. వృద్ధురాలిపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది. కమలనాథ్ అనే యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి.. ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. కంగుతిన్న ఆమె.. బిగ్గరగా కేకలు వేయగా.. ఆమె నోరు నొక్కి.. అత్యాచారం చేసి పరారయ్యాడు.

Advertisement

ఈ అఘాయిత్యం గురించి వృద్ధురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు అస్వస్థతకు గురవ్వడంతో.. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు కమలనాథ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×