E-Paper
Advertisement

Nellore: కోటంరెడ్డి, అనిల్ అనుచరుల వార్.. కత్తిపోట్లతో నెల్లూరులో హైటెన్షన్..

Nellore: కోటంరెడ్డి, అనిల్ అనుచరుల వార్.. కత్తిపోట్లతో నెల్లూరులో హైటెన్షన్..
Advertisement

Nellore: అనుకున్నట్టే జరుగుతోంది. నెల్లూరులో గ్యాంగ్ వార్ మొదలైంది. రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, మిగతా వైసీపీ లీడర్లకు మధ్య ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది. కనబడితే కొట్లాటకు దిగే పరిస్థితి వచ్చింది. తాజాగా, నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గా దగ్గర పెద్ద ఎత్తున ఘర్షణ జరగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు, మాజీ మంత్రి అనిల్ ఫాలోయర్స్.. పరస్పరం ఎదురుపడ్డారు. ఒకరిని చూడగానే ఇంకొకరు ఆవేశంతో రగిలిపోయారు. మాటా మాటా అనుకున్నారు. కొట్టుకున్నారు. తన్నుకున్నారు. కత్తితో దాడి చేసుకున్నారు.

Advertisement

గొడవలో ఎమ్మెల్యే అనిల్ అనుచరుడైన సమీర్ కు కత్తిపోట్లు దిగాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని అనిల్ కుమార్ పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు.

భారీ ఘర్షణతో నెల్లూరు జిల్లాలో హైటెన్షన్ క్రియేట్ అయింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉన్నారు. సమీర్ కు కత్తిపోట్లపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు నివురుగప్పిన నిప్పులా ఉంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×