E-Paper
Advertisement

Tirumala: తిరుమలలో ఇక రాజకీయ నేతల పప్పులు ఉడకవ్.. నేటి నుంచే ఆ రూల్ అమలు!

Tirumala: తిరుమలలో ఇక రాజకీయ నేతల పప్పులు ఉడకవ్.. నేటి నుంచే ఆ రూల్ అమలు!
Advertisement

Tirumala: తిరుమలలో అడుగుపెట్టామంటే చాలు.. అడుగడుగునా గోవిందా.. గోవిందా అనే నామస్మరణతో సప్తగిరులు మార్మోగుతాయి. అలాంటి తిరుమలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది బోర్డు. గతానికి భిన్నంగా ఈసారి వ్యవహరించనుంది. అందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం, బోర్డు ఆమోదించడం చకచకా జరిగిపోయింది.

ఈ నేపథ్యంలో శనివారం నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం మొదలైంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శనివారం నుంచి అమలు చేస్తోంది.

Advertisement

దేవుడి పేరు చెప్పి తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. అక్కడ రాజకీయాల గురించి మాట్లాడితే.. మేసెజ్ ప్రజల్లోకి వెళ్తుందనేది నేతల ఆలోచన. గడిచిన ఐదేళ్లు అక్కడి నుంచి రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. సింపుల్‌గా చెప్పాలంటే తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలిగింది.

పరిస్థితి గమనించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పాత పద్దతికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. రాజకీయ విమర్శలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టి పెట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది బోర్డు.  నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Advertisement

ALSO READ:  వైసీపీ నేతల పీఏలు అరెస్ట్.. టార్గెట్ వాళ్లేనా..?

బోర్డులో నిర్ణయం తీసుకోగానే నేతలు పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. చాలామంది నేతలు తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మాట్లాడాలని కొంతమంది ఒత్తిడి చేసినా, తప్పించుకునే ప్రయత్నం చేశారు కొందరు.

అలాగే స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం కల్పించనుంది టీటీడీ. ప్రతినెలా మొదటి మంగళవారం తిరుపతి మహతి ఆడిటోరియంలో ఉదయం ఐదుగంటలకు టోకెన్లు జారీ చేయనుంది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చు.

రీసెంట్‌గా తిరుమల కొండపై ఆలయం ముందు ఓ నాయకుడికి చెందిన బంధువులు ఫొటో షూట్ చేశారు. నలుగురు ఫొటోగ్రాఫర్లతో వీడియోలు, ఫొటోలు తీయించు కుంటూ హడావుడి చేశారు. ఇంత జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు ఏమీ తెలియనట్టు వ్యవహరించడం గమనార్హం.

నెల రోజుల కిందటికి వెళ్తే.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దంపతులు ఆలయం సమీపంలో రీల్స్ చేశారు. దీనిపై టీటీడీ విభాగం ఫిర్యాదు చేయడం, కేసు నమోదు కావడం జరిగిపోయింది. ఇదేకాకుండా నిత్య అన్నదానం మెనూలో మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒకొక్కటిగా తిరుమలలో మార్పులు చేసుకుంటూ వస్తోంది టీటీడీ.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×