E-Paper
Advertisement

Vijayawada: యువగళంతో బెజవాడ గరంగరం.. చూడండోయ్‌ నాని గారు!

Vijayawada: యువగళంతో బెజవాడ గరంగరం.. చూడండోయ్‌ నాని గారు!
Advertisement
nara-lokesh-yuvagalam yatra

Vijayawada: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువ గళం పాదయాత్ర.. విజయవాడలో ప్రవేశించనుంది. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు పాదయాత్ర విజయవాడ చేరుకోనుంది. యాత్ర కోసం టీడీపీ లీడర్లు భారీగా స్వాగతం తోరణాలు, కటౌట్లు ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు.

లోకేశ్‌ యాత్ర నేపథ్యంలో బెజవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కటౌట్లు,ఫ్లెక్సీలు, జెండాలు, స్వాగత తోరణాలు తొలగించాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి కోసం కమిషనర్‌తో సమావేశం అయ్యేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. కానీ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్‌తో భేటీ అయ్యారు. అనుమతిపై పరిశీలిస్తానని టీడీపీ నేతలకు కలెక్టర్ హామీ ఇచ్చారు.

Advertisement

మరోవైపు, టీడీపీలోని రాజకీయ పరిణామాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఫ్లెక్సీల్లో ఎక్కడ కూడా ఎంపీ కేశినేని నాని ఫోటో లేకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. అటు.. కృష్ణా జిల్లాలో యాత్ర నిర్వహణ బాధ్యతల్ని టీడీపీ నేత కేశినేని చిన్నికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది. ఇప్పటివరకు లోకేశ్‌ యాత్ర బాధ్యతల్ని ఎంపీలు, జిల్లా కన్వీనర్లు చూస్తున్నారు. విజయవాడలో టీడీపీ ఎంపీ నానికి కాకుండా.. ఆయన తమ్ముడి చిన్నికి బాధ్యతలు అప్పగించారు. కేశినేని నానిని టీడీపీ దూరం పెడుతోందన్న ప్రచారం ఉంది. ఇదే సమయంలో చిన్నికి యాత్ర బాధ్యతలు అప్పగించడం, ఫ్లెక్సీల్లో ఎక్కడా ఫోటో లేకపోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×