E-Paper
Advertisement

Pawan Kalyan: పవన్‌కు పోలీస్ నోటీసులు.. అరెస్ట్ చేస్తారా? అడ్డుకుంటారా?

Pawan Kalyan: పవన్‌కు పోలీస్ నోటీసులు.. అరెస్ట్ చేస్తారా? అడ్డుకుంటారా?
Advertisement
pawan varahi

Pawan Kalyan: విశాఖలో వారాహి విజయయాత్ర హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. మొదటి రెండు విడతల్లా లేదు ఈసారి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అనో ఏమో.. వారాహికి బ్రేకులు వేసే ప్రయత్నం గట్టిగానే నడుస్తోంది. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ జనసేనాని సభలతో విరుచుకుపడుతున్నారు. జగదాంబ సెంటర్లో సర్కారుపై మరోసారి రెచ్చిపోయారు. కట్ చేస్తే.. పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ సెక్షన్ 30 ప్రకారం విశాఖ పోలీసులు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. విశాఖ తూర్పు ఏసీపీ నోటీసులు అందజేశారు. సభలో పవన్ కల్యాణ్‌ నిబంధనలు ఉల్లంఘించారని నోటీసులో ఆరోపించారు. ప్రజల్లో విభేదాలు రెచ్చగొట్టొద్దని, నిరాధార ఆరోపణలు చేయొద్దని, పోలీస్ ఆంక్షలు ఫాలో అవ్వాలని, షెడ్యూల్ ముందుగానే పోలీసులకు ఇవ్వాలని.. ఇలా పలు అంశాలను నోటీసులో ప్రస్తావించారు.

జనసేనాని కొత్త విషయాలేమీ మాట్లాడలేదు. గత వారాహి యాత్రల్లో చేసిన విమర్శలు, ఆరోపణలే ఈసారి కూడా చేశారు. కానీ, అప్పుడు నోటీసులు ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం పోలీసులు నోటీసులు చేతిలో పెట్టారు. అంటే..? ఇకపై పవన్ దూకుడుకు బ్రేకులు వేయాలనే సర్కారు డిసైడ్ అయిందా? జనసేనానిని స్వేచ్ఛగా వదిలేస్తే.. మరింత రెచ్చిపోతారనే భయమా? పవర్‌ఫుల్ లీడరైన పవన్‌ను ఇలాంటి నోటీసులతో అడ్డుకోగలరా? అనే చర్చ నడుస్తోంది.

Advertisement

ఇక, రుషికొండ పర్యటనపైనా పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పవన్ వాహనంతో పాటు మరో 7 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రుషికొండను రోడ్డు మీద నుంచే చూడాలని కండిషన్ పెట్టారు. మరి, పోలీసుల ఆంక్షలను జనసేనాని లెక్క చేస్తారా? మనల్ని ఎవడ్రా ఆపేదంటూ.. దూసుకెళతారా?

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×