E-Paper
Advertisement

Vijayawada: యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌.. ఫోన్‌లో సీక్రెట్ యవ్వారాలు, తీగ లాగితే డొంక కదిలింది

Vijayawada: యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌.. ఫోన్‌లో సీక్రెట్ యవ్వారాలు, తీగ లాగితే డొంక కదిలింది
Advertisement

Vijayawada: యూట్యూబర్ ప్రశ్న రావణ్ మాటేంటి? ఆయన కేసులో పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? రావణ్ ఫోన్‌లో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయా? అంతేకాదు సీక్రెట్ వీడియోలు అందులో ఉన్నాయా? మరి ఆర్థిక లావాదేవీల మాటేంటి? అనేదానిపై లోతుగా విచారణ చేస్తున్నారు. అది బయటపడితే రావణ్ వెనుక అసలున్నది ఎవరు అనేది తేలనుంది.

యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ లీలలు-సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయ్యాడు యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌. ఆయన అరెస్టు సమయంలో మీడియాలోని ఓ వర్గం నానాహంగామా చేసింది. పోలీసుల విచారణలో ఆయన గురించి కొత్త విషయాలు బయటపడడంతో ఆ వర్గం సైలెంట్ అయిపోయింది.

Advertisement

రావణ్‌ ఫోన్‌లో సీక్రెట్ యవ్వారాలు-అంతేకాదు ఆయన వీడియోల గురించి కొత్త ప్రచారం మొదలుపెట్టింది. అవన్నీ ఏఐ వీడియోలు అంటూ కొత్త పల్లవి అందుకుంది. దీంతో ఆయన వెనుక బలమైన వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రావణ్ ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ చేశారు విచారణ అధికారులు. జరుగుతున్న పరిణామాలను గమనించిన రావణ్, జూలై రెండున తన ఫోన్ లోని డేటా మొత్తానికి డిలీట్ చేశాడట.

గుడివాడలో అరెస్ట్‌ చేసిన తర్వాత ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాన్ని అమరావతిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ పంపడంతో డిలీట్‌ చేసిన కొన్ని వీడియోలు, ఇతర డేటాను కొంతవరకు వెలికి తీసినట్టు తెలుస్తోంది. డిలీట్‌ చేసిన వీడియోల్లో కీలక ఆధారాలు లభించాయి.

Advertisement

అంతా హోటల్‌లో ఆ వ్యవహారాలు-చివరకు వ్యక్తిగత వీడియోలు సైతం గుర్తించినట్టు వార్తలు వస్తున్నాయి. నలుగురైదుగురితో అసభ్యంగా తీసుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. హోటల్‌ గదిలో చేసిన పనులు, సంభాషణలు అందులో ఉన్నాయట. తొలగించిన వీడియోల్లో ఎక్కువగా సీక్రెట్ యవ్వారాల దృశ్యాలు ఉన్నట్లు గుర్తించారు.

ALSO READ: పెళ్లి వేడుకల సాక్షిగా రక్తపాతం.. ఇద్దర్ని లేపేసిన ప్రత్యర్థులు, తిరుపతి సిటీలో జంట హత్యల కలకలం 

వాటి ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్‌ కాల్స్‌, చాటింగ్‌ వివరాలను రికవరీ చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. రావణ్‌ చేతిలో మోసపోయిన బాధిత మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.

హిందూ దేవతలు, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రావణ్‌, ఆ అమ్మాయిలను బెదిరించి లోబర్చుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అమాయక యువతుల లక్ష్యంగా వారితో అసభ్యంగా ప్రవర్తించడం, ఏకాంతంగా ఫొటోలు, వీడియోలు తీసి ఉంటాడని ఓ అంచనా. మొత్తానికి రావణ్ ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడితే చాలామంది లోపలకు వెళ్లడం ఖాయమని అంటున్నారు కొందరు పోలీసులు.

ఇదిలావుండగా యూట్యూబ్ ద్వారా నెలకు దాదాపు లక్షన్నర ఆదాయం సంపాదించినట్టు పోలీసుల విచారణలో చెప్పాడు రావణ్.  ఆయన బ్యాంకు లావాదేవీలు నిలిపివేయాలని రెండు వేర్వేరు బ్యాంకుల అధికారులకు లేఖ రాశారు కాకినాడు. పోలీసుల ఆదేశాలతో రావణ్ బ్యాంకు ఖాతాలు నిలిపివేయడంతో  అసలు గుట్టు బయటపడనుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×