E-Paper
Advertisement

YCP activist Arrested: గర్భిణిపై వైసీపీ మూక దాడి.. మంత్రి లోకేష్ ఆగ్రహం

YCP activist Arrested: గర్భిణిపై వైసీపీ మూక దాడి.. మంత్రి లోకేష్ ఆగ్రహం
Advertisement

YCP activist Arrested: శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో రాజకీయ కక్షల నేపథ్యంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంధ్యారాణి అనే నిండు గర్భిణీపై వైసీపీ కార్యకర్త అజయ్ దేవా అత్యంత కిరాతకంగా దాడికి తెగబడ్డాడు. గర్భిణీ అని కూడా చూడకుండా ఆమె కడుపుపై కాలితో తన్నడంతో ఆ మహి తీవ్ర అస్వస్థతకు గురైంది.

ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. గర్భిణీ మహిళపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఇలాంటి మృగాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడంతో పాటు, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సూచించారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు అజయ్ దేవాను అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై దాడులు చేస్తే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రజలందరికీ తెలిసేలా పోలీసులు వినూత్నంగా వ్యవహరించారు.
నిందితుడిని కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు నడిరోడ్డుపై నడిపించి ఊరేగించారు.

భవిష్యత్తులో మరొకరు ఇటువంటి దారుణాలకు ఒడిగట్టాలంటేనే భయపడేలా పోలీసులు ఈ ఊరేగింపు నిర్వహించారు. నిందితుడిని పట్టణం నడిబొడ్డున నడిపించడం ద్వారా.. ఆడబిడ్డలపై చేయి వేస్తే చట్టం ఊరుకోదనే బలమైన సందేశాన్ని పంపారు. నిందితుడి వెనుక ఎంతటి రాజకీయ బలం ఉన్నా వదిలిపెట్టమని, శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement

Also Read: భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఇక తులం కొనాలంటే తల ప్రాణం తోకకు రావాల్సిందే 

ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మరికాసేపట్లో కదిరి పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ దాడికి గల ప్రాథమిక కారణాలు, నిందితుడిపై నమోదైన సెక్షన్లు, బాధితురాలి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించనున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×