// // Dorababu: దమ్ముంటే విచారణ జరిపించండి.. వర్మకు దొరబాబు ఓపెన్ ఛాలెంజ్! -->
E-Paper
Advertisement

నాపై కోవర్ట్ ముద్ర వేస్తారా? దమ్ముంటే విచారణ జరిపించండి.. వర్మకు దొరబాబు ఓపెన్ ఛాలెంజ్!

నాపై కోవర్ట్ ముద్ర వేస్తారా? దమ్ముంటే విచారణ జరిపించండి.. వర్మకు దొరబాబు ఓపెన్ ఛాలెంజ్!
Advertisement

Dorababu: పిఠాపురం రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనం రేపుతున్నాయి. తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వర్మపై నిప్పులు చెరిగారు. అసలు తమ మధ్య గొడవ ఎక్కడ మొదలైందో చెబుతూ.. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని వర్మ చింపడం వల్లే తాను తీవ్రంగా విభేదించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. కేవలం తన వ్యక్తిగత లాభాల కోసం, రాజకీయ ఉనికి కోసం వర్మ కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని దొరబాబు మండిపడ్డారు.

పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు చేరకుండా వర్మ అడ్డుకుంటున్నారని దొరబాబు ఆరోపించారు. వర్మ సాగిస్తున్న భూకబ్జాల వ్యవహారం తన వద్ద ఉందని, త్వరలోనే అన్ని ఆధారాలతో వాటిని బయటపెడతానని హెచ్చరించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, ప్రతి విషయంలోనూ తాను పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

ముఖ్యంగా తాను వైసీపీకి కోవర్ట్‌గా పని చేస్తున్నాననే ప్రచారాన్ని దొరబాబు కొట్టిపారేశారు. ‘నాకు ఎవరికీ కోవర్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు’ అని ఆయన కుండబద్దలు కొట్టారు. అవినీతిపై ఎవరికైనా అనుమానాలు ఉంటే, జనసేన పార్టీ అనుమతిస్తే ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేందుకు కూడా తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఎవరి హయాంలో అవినీతి జరిగిందో, ఎవరు ప్రజల సొమ్మును దోచుకున్నారో ఆ విచారణలో తేలుతుందని దొరబాబు ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి దొరబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

Also Read: మీ ఇంట్లో ఎంత మంది సీఎంలు అవుతారు హరీష్ రావు? సామెల్ సూటి ప్రశ్న

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×