E-Paper
Advertisement

Pilli Bose : జగన్ కు పిల్లి బోస్ షాక్..! జనసేనలో చేరతారా..?

Pilli Bose : జగన్ కు పిల్లి బోస్ షాక్..! జనసేనలో చేరతారా..?
Advertisement
Pilli subhash chandra bose news

Pilli subhash chandra bose news(YSRCP latest updates) : వైసీపీకి ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ షాక్‌ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఆయన జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పిల్లి కుమారుడు సూర్యప్రకాష్ కు జనసేన టికెట్‌ కన్ఫామ్‌ అయిందని అంటున్నారు. త్వరలోనే తన రాజ్యసభ సభ్యత్వానికి పిల్లి బోస్ రాజీనామా చేస్తారని సమాచారం. ఇటీవల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌, పిల్లి సుభాష్‌ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

సీఎం జగన్‌ వద్దకు రామచంద్రపురం పంచాయితీకి వెళ్లింది. ఇప్పటికే బోస్ .. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తన వాయిస్ ను వినిపించారు. జగన్ నుంచి సరైన హామీ లభించకపోవడంతో తన రాజకీయ భవిష్యత్ పై బహిరంగంగా ప్రకటన చేశారు. రామచంద్రపురం టిక్కెట్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఇస్తే తాను అక్కడ నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. దీనికి మంత్రి వేణు కూడా కౌంటర్ వేశారు. తాను రామచంద్రపురం నుంచే పోటీకి దిగుతానని ప్రకటించారు.

Advertisement

రామచంద్రపురంలో బోస్, వేణు పంచాయితీ నేపథ్యంలో వైసీపీ నేత తోట త్రిమూర్తులుకు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తాజా పరిణామాలపై ఆయన నుంచి సమాచారం సేకరించింది. ఈ క్రమంలో బోస్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేస్తారని సమాచారం. ఆయన కుమారుడిని జనసేన తరఫున రామచంద్రపురం బరిలోకి దింపాలని యోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే టిక్కెట్ విషయంలో జనసేన నుంచి స్పష్టమైన హామీ వచ్చిందని అంటున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×