E-Paper
Advertisement

Jagan: జగన్‌కి కొత్త కష్టాలు.. హైకోర్టులో పిటిషన్, ఎందుకు?

Jagan: జగన్‌కి కొత్త కష్టాలు.. హైకోర్టులో పిటిషన్, ఎందుకు?
Advertisement

Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు కొత్త కష్టాలు మొదలైనట్టు కనిపిస్తు న్నాయి. లిక్కర్ కుంభకోణంలో రేపోమాపో ఆయనకు నోటీసు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతోంది. అదే సమయంలో కొత్త సమస్య మొదలైంది. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై సీబీఐ-ఈడీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. వచ్చేవారం ఆ పిటిషన్ విచారణకు రానుంది.

వైసీపీ హయంలో జరిగిన అవినీతిపై ఒక్కోదానిపై విచారణ మొదలైంది. ఏ శాఖ పట్టుకున్నా అవినీతి జరిగిందంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఇసుక, లిక్కర్, రేషన్ బియ్యం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇదే పాయింట్ పట్టుకుని ఓ అడ్వకేట్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

Advertisement

కూటమి సర్కార్ బయటపెట్టిన శ్వేతపత్రాల ఆధారంగా వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరిపించాలని ఢిల్లీకి చెందిన అడ్వకేట్ మెహెక్ మహేశ్వరి పిల్ వేశారు. కూటమి సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రాల ఆధారంగా సీబీఐ-ఈడీ-ఐటీ శాఖలతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు.

ఆయా సంస్దలతో ఓ సిట్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా చూడాలన్నది ప్రధాన పాయింట్. దీనిపై ఆగస్టు 6న హైకోర్టు సీజే ధీరజ్‌సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది.

Advertisement

ALSO READ: సింహాచలం ఆలయంలో వివాహాలు.. కొత్త రూల్స్ వచ్చేశాయి

ఆన్‌లైన్‌లో హాజరైన అడ్వకేట్ మహేశ్వరి.. తన వాదనలను స్వయంగా వినిపించడానికి కొంత సమయం కోరారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారని న్యాయస్థానం ప్రశ్నించింది.  మూడు నుండి నాలుగు పిటిషన్లు దాఖలు చేశానని బదులిచ్చారు.

ఆయా అంశాలపై సిట్ దర్యాప్తు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ హైకోర్టుకు వివరించారు. జగన్, సహచరులు పాల్పడిన అక్రమాలపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగేలా చూడాలన్నారు. ఈ పిటిషన్‌పై విచారించనున్న న్యాయస్థానం, ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందన్న చర్చ అప్పుడే వైసీపీలో మొదలైంది.

దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తే, జగన్ ఇబ్బందుల్లో పడినట్టేనని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వివిధ శాఖల్లో విచారణ కొనసాగుతోంది. లిక్కర్ విషయంలో దాదాపు డజను మందిని అరెస్టు చేశారు సిట్ అధికారులు. ఈ కేసులో రేపోమాపో కొందరికి నోటీసులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో న్యాయస్థానం ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×