E-Paper
Advertisement

Perni Nani: మసీదుకు వెళ్లి ప్రార్ధన చేసే చంద్రబాబు నిఖార్సైన హిందువా.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

Perni Nani: మసీదుకు వెళ్లి ప్రార్ధన చేసే చంద్రబాబు నిఖార్సైన హిందువా.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
Advertisement

Perni Nani Key Comments on Chandrababu Naidu: తిరుమల డిక్లరేషన్ వివాదంపై మాజీ మంత్రి పేర్ని నానీ జగన్ ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాల్సి అవసరం ఏంటి అని ప్రశ్నించారు. శ్రీవారిపై నమ్మకంతో జగన్ అనేక సార్లు దర్శనం చేసుకున్నారు కదా.. తిరుమలకు వచ్చే వారందరిని నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు పేర్ని నాని. మోదీతో అన్యమతస్తుడు తిరుమల వెళ్తే బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై నిరసనలు వ్యక్తం చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో పేర్ని నాని ఆలయాల్లో నిర్వహించిన పూజలో పాల్గొన్నారు.

అదేవిధంగా చంద్రబాబును విమర్శిస్తూ.. నిజంగా మీరు చెప్పే మాటలన్ని నిజమైతే హైందవ మతం కోసం, హైందవ ఆచారం కోసం మీరు బతుకుతున్నారనిపిస్తే.. ప్రతి ఏడాది క్రిస్మస్ రోజు మీరు చర్చీలకు వెళ్లి బైబుల్లో వాఖ్యాన్ని ఎందుకు చదువుతున్నారు.. నేను దేవుడ్ని నమ్ముతున్నాని ఎందుకు చెబుతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నావా, ఏసుప్రభువుని నమ్ముతున్నావా అంటూ విమర్శలుగుప్పించారు. మసీదుకు వెళ్లి ప్రార్ధన చేసే చంద్రబాబు నిఖార్సైన హిందువా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ మోహన్ తాత తండ్రి ఏసు ప్రభువును కొలవడం మెదలుపెట్టారని, ప్రజలకు తెలుసని చెప్పారు.

Advertisement

Also Read: పవన్ పై వ్యతిరేకత.. తమిళనాడులో రోజా బిజి బిజీ, ప్లాన్ ‘అదిరింది’

జగన్ మతమేంటో తెలుగు ప్రజలకు తెలుసు.  దేవునికి పూజ చేసేటప్పుడు బూట్లు వేసుకుని పూజ చేసే చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోవడమేంటన్నారు. ఇటీవల క్రిస్టియన్ నటి శ్రీవారిని దర్శించుకున్నారని, ఆమెకు డిక్లరేషన్ ఇచ్చారా అంటూ పేర్ని నాని నిలదీశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×