E-Paper
Advertisement

Peddireddy On Chandrababu: సీఎం చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్.. ప్రజల్ని మోసం చేశారంటూ రుసరుస

Peddireddy On Chandrababu: సీఎం చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్.. ప్రజల్ని మోసం చేశారంటూ రుసరుస
Advertisement

Peddireddy On Chandrababu: చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అప్పుడు సూపర్ సిక్స్ అన్నారని, ఇప్పుడు సాధ్యం కాదని చెబుతున్నారని మండిపడ్డారు.  సూపర్ సిక్స్ లేదని చివరకు గుండు సున్నా మిగిలిందన్నారు.

శ్రీలంక మాదిరిగా ఏపీ తయారైపోయిందని ఆనాడు అన్నారని, ఈ విషయంలో పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వంత పాడారన్నారు. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అంతర్జాతీయ ఆర్థికవేత్తలతో మాట్లాడి హామీ ఇచ్చానని అంటారని తెలిపారు.

Advertisement

చెప్పింది చేసే నాయకుడు జగన్ అని, ఆనాడు వైసీపీ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తే పప్పు బెల్లాలని అన్నారని గుర్తు చేశారు. మోసం చేసిన ఇలాంటి నేతలు రాజకీయాల్లో కొనసాగించవచ్చా అంటూ మండిపడ్డారు.  ప్రజల మనోభావాలపై రాళ్ళు వేశారని, కేవలం 7 నెలల్లో 1.19 లక్షల కోట్లు అప్పు తెచ్చారని వ్యాఖ్యానించారు.

ఆ సొమ్ము ఏ సంక్షేమానికి ఎంత ఇచ్చారని ప్రశ్నించారు పెద్దిరెడ్డి. రెండేళ్లు కొవిడ్ ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమాన్ని అందించామని వివరించారు. ఆరోగ్య శ్రీతో పాటు జిల్లాకు మెడికల్ కాలేజీ ఇస్తే నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడితే జగన్ విధ్వంసం చేశారని అంటున్నారని ఆరోపించారు. పేదలను ఆదుకోవడం విధ్వంసమా? అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయడం నిజం కాదా అంటూ రుసరుసలాడారు.

Advertisement

ALSO READ:  ఏపీలో వాట్సాప్ పాలన.. తొలుత 161 సేవలు, ఆ తర్వాత

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×