E-Paper
Advertisement

Peacock Spider: నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ సాలీడు.. తూర్పు కనుమలకు పరిమితం, ఏపీ ప్రభుత్వం ఫోకస్

Peacock Spider: నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ సాలీడు.. తూర్పు కనుమలకు పరిమితం, ఏపీ ప్రభుత్వం ఫోకస్
Advertisement

Peacock Spider: నల్లమల అడవుల గురించి చెప్పనక్కర్లేదు. ఆధ్యాత్మికం, ప్రకృతి పరంగా ప్రశాంతంగా ఉంటుంది. దట్టమైన అడవి, ఆపై గుళ్ళు, గోపురాలు, జలపాతాలకు కొదవలేదు. తూర్పు కనుమల్లో అరుదైన ప్రాంతం. వేల రకాల జీవులకు ఆవాసం కల్పిస్తోంది. మనిషి కంటికి కనిపించని అరుదైన ప్రాణులు అక్కడున్నాయి. తాజాగా నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ సాలీడు దర్శనమిచ్చింది. వీటి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం.

నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ సాలీడు

Advertisement

తూర్పు కనుమల్లో అరుదైన జీవి పరిరక్షణకు నడుం బిగించింది ఏపీ ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా చాలా జీవులు అంతరించిపోతున్నాయి. అలాంటివాటిలో పీకాక్ టరంటులా సాలీడు ఒకటి.నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ సహకారంతో ఏపీ అటవీ శాఖ ఈ తరహా సాలీడుపై పరిరక్షణ కోసం సర్వేను ప్రారంభించింది.

నీలం రంగులో మెరిసిపోయే పీకాక్ సాలీడు ప్రపంచంలో కేవలం తూర్పు కనుమలకు పరిమితమైంది. అత్యంత అరుదైన, ప్రత్యేకమైన జీవి. దీంతో ఆయా జీవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది కూటమి సర్కార్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అటవీశాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Advertisement

తూర్పు కనుమలకు పరిమితం, ఏపీ ప్రభుత్వం ఫోకస్

ఈ సర్వే ద్వారా నల్లమల అడవుల్లో సాలీడుల జనాభా, విస్తరణ, ఆవాసాల పరిస్థితిని అంచనా వేయనుంది. సేకరించిన వివరాల ఆధారంగా వాటి భవిష్యత్తును కాపాడేందుకు పటిష్టమైన పరిరక్షణ ప్రణాళికలు రూపొందించనుంది. పెద్ద జంతువులే కాకుండా అరుదైన, ప్రత్యేకమైన జీవులను కాపాడుకోవడం జీవ వైవిధ్య పరిరక్షణలో భాగమని అంటున్నారు.

గతంలో కూడా ఎన్నో అరుదైన జీవులు ఆ ప్రాంతంలో కనిపించాయి. ఇదేకాదు ఈ ప్రాంతంలో అరుదైన సర్పజాతులు మనుగడ సాగిస్తున్నాయి. చెట్లపై ఎగిరే పాములను సైతం ఈ ప్రాంతంలో గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3500 రకాల జాతుల పాములు ఉన్నాయి. మన దేశంలో 300 రకాల పాములు ఉండగా, ఒక్క నల్లమల్ల అడవుల్లో దాదాపు 50 రకాల సర్పాలు ఉన్నట్లు అటవీశాఖ గుర్తించిన విషయం తెల్సిందే.

ALSO READ: చంద్రబాబుకు మెగలోమేనియా అనే వ్యాధి ఉంది.. భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×