E-Paper
Advertisement

PDS Rice Missing Case: చిక్కుల్లో పేర్నినాని.. వెంటాడుతున్న రేషన్ బియ్యం.. ఈసారి ఆయన వంతు

PDS Rice Missing Case: చిక్కుల్లో పేర్నినాని.. వెంటాడుతున్న రేషన్ బియ్యం.. ఈసారి ఆయన వంతు
Advertisement

PDS Rice Missing Case: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ప్లాన్ బూమరాంగ్ అయ్యిందా? ఆయన ప్లాన్ బెడిసి కొట్టిందా? ముఖ్యమంత్రి-మంత్రుల మధ్య చిచ్చు పెట్టాలని భావించి బుక్కయ్యారా? ఇప్పుడు ఆయన అడ్డంగా ఇరుక్కుపోయారా? రేపో మాపో ఆయనను పోలీసులు విచారించనున్నారా? అవుననే సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.

రేషన్ బియ్యం వ్యవహారం వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఆ పార్టీలో మాటల మాంత్రికుడి‌గా పేరుపొందిన మాజీ మంత్రి పేర్నినాని చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆయనను ఏ-6గా చేరుస్తూ మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని ఆదేశాల మేరకు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారట.

Advertisement

కేసు నమోదైన నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపో మాపో ఆయన్ని అరెస్టు చేయడం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌కు పేర్నినాని ప్లాన్ చేస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ కేసులో ఇప్పటికే నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి న్యాయస్థానం 12 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకి తరలించారు. ఇందులో ఏ-1గా పేర్నినాని భార్య జయసుధ పేర్కొన్నారు. ఆమెకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

ALSO READ: జగన్‌ని ఆటాడుటున్న కూటమి సర్కార్.. ఓ వైపు సీఎం, మరోవైపు డిప్యూటీ సీఎం

ఇదిలావుండగా రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో కీలక అప్‌డేట్. కాకినాడ పోర్టు బియ్యం బోకర్ల నుంచి రూ. 94 లక్షలు A-2గా ఉన్న మానస తేజ బ్యాంక్ ఖాతాకు వచ్చినట్టు గుర్తించారట. మానస తేజ అకౌంట్‌ నుంచి పేర్నినాని సతీమణి అకౌంట్‌కు భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్టు సమాచారం. దీనివెనుక గుడ్లవల్లేరు మండలం పురిటిపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని గతరాత్రి చీరాలలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

వైసీపీ రూలింగ్‌లో ట్రాన్స్‌పోర్టు శాఖ మంత్రిగా వ్యవహరించారు పేర్ని నాని. ఆ సమయంలో భార్య జయసుధ పేరిట గోదాంను నిర్మించారు. ఆ తర్వాత పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఆ శాఖ అధికారులు గోదాంను తనిఖీలు చేశారు. లెక్కలకు, బియ్యం నిల్వల్లో వ్యత్యాసం కనిపించింది. పెద్ద ఎత్తున పీడీఎస్ రైస్ మాయం అయినట్టు గుర్తించిన విషయం తెల్సిందే.

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×