E-Paper
Advertisement

Chandrababu : చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తులపై చర్చ..?

Chandrababu : చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తులపై చర్చ..?
Advertisement

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం ఈ సమావేశానికి వేదికైంది. జనసేనానికి చంద్రబాబు స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు , ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనలపైనా ఇరువురు నేతలు చర్చించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌-1పైనా తాజా భేటీలో చర్చించారు. దాదాపు 2 గంటలపాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తాజాా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం చేయాలని ఇప్పటికే చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. కొద్దినెలల క్రితం విజయవాడలోని ఓ హోటల్‌లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ తాజా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

Advertisement

అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే అనంతపురం జిల్లాలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసినా తాను గెలిపిస్తానని భరోసా ఇచ్చారు. జనసేనాని గెలుపు బాధ్యతను తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. పవన్, చంద్రబాబు భేటీ నేపథ్యంలో…ప్రభాకర్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×