E-Paper
Advertisement

Pawan tour cancelled: పవన్ టూర్ రద్దు.. అందుకోసమేనట.. బాధ్యత అంతా బాబుపైనే!

Pawan tour cancelled: పవన్ టూర్ రద్దు.. అందుకోసమేనట.. బాధ్యత అంతా బాబుపైనే!
Advertisement

Pawan Kalyan Tenali nellimarla tour cancelled due to Health reasons

Pawan tour cancelled: ఏపీలో ఎండ తీవ్రత పెరిగింది. ఎక్కడ కాళ్లు పెట్టినా కాలిపోతున్నాయి. పైగా ఎన్నికల వాతావరణం.. కలిసి నేతలు అనారోగ్యం బారినపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పవన్ కల్యాణ్ చేరిపోయారు.

Advertisement

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెనాలి టూర్ రద్దయ్యింది. ఏ ముహుర్తాన అయితే పవన్‌కల్యాణ్ పిఠాపురం వెళ్లారో.. అప్పటి నుంచి ఆయనకు అనారోగ్యం వెంటాడుతోంది. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బుధవారం తెనాలిలో జరగాల్సిన రోడ్ షో, బహిరంగ సభ రద్దయ్యింది. అలాగే గురువారం విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరగాల్సిన వారాహి బహిరంగ సభ కూడా వాయిదా పడింది.

ప్రస్తుతం జ్వరంతో పవన్‌కల్యాణ్ బాధపడుతున్నట్లు వైద్యులు చెప్పారు. ఎండలు మండిపోతున్నా లెక్క చేయకుండా మంగళవారం విజయభేరి యాత్ర నిర్వహించారు పవన్‌కల్యాణ్. డాక్టర్లు చెబుతున్నా ఎండలో ఏకంగా 20 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. దీంతో అస్వస్థతకు గురికావడంతో రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పారు. చివరకు తెనాలి, నెలిమర్ల టూర్‌ను రద్దు చేసుకున్నారు.

Advertisement

ALSO READ: ఏపీపై కన్నేసిన ఈసీ… నెక్ట్స్ జాబితాలో వీళ్లిద్దరేనా?

ఈ క్రమంలో ఏపీలో కూటమి తరపున బాధ్యత అంతా టీడీపీ అధినేత చంద్రబాబుపై పడింది. రోడ్ షోలు, సభల్లో పాల్గొంటూ అధికార పార్టీని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో రోడ్ షోలకు హాజరవుతున్నారు. ఇంకా బీజేపీ తన లిస్టును ప్రకటించలేదు. దీంతో నేతలంతా తమ ఇంటికే పరిమితమయ్యారు. ఫేమ్ ఉన్న నేతలు ఇంకా ప్రచారంలోకి అడుగుపెట్టలేదు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×