E-Paper
Advertisement

Deputy CM Pawan: డిప్యూటీ సీఎంకు హై ఫీవర్.. డిక్లరేషన్ సభ మాటేంటి?

Deputy CM Pawan: డిప్యూటీ సీఎంకు హై ఫీవర్.. డిక్లరేషన్ సభ మాటేంటి?
Advertisement

Deputy CM Pawan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెల్త్ ఎలావుంది? ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏమంటున్నారు? ఆయన తేరుకునేందుకు మరో రెండురోజులు పడుతుందా? అలాగైతే తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ లేనట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హై ఫీవర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన తిరుమలలోని అతిథి గృహంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. మరో రెండు, మూడు రోజులు ఎక్కడికీ కదలడానికి వీల్లేదని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. దీంతో రెండురోజులపాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత్తం దీక్ష చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. బుధవారం శ్రీవారి సన్నిధిలో దీక్ష విరమించారాయన. కూతుళ్లతో కలిసి  తిరుపతి నుంచి తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లినప్పుడే లైట్‌గా జ్వరం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నడుకుంటూ తిరుమలకు వెళ్లారు. రాత్రి విపరీతమైన నొప్పులతో హై ఫీవర్ వచ్చిందని సమాచారం.

దీంతో డాక్టర్ల టీమ్ అక్కడికి వెళ్లి ఆయనకు పరీక్షలు నిర్వహించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతిలో జనసేన వారాహి డిక్లరేషన్ సభకు శ్రీకారం చుట్టూరు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతీ ఒక్కరూ ఈ సభకు తరలి రావాలని పిలుపు నిచ్చారు.

Advertisement

ALSO READ:  టీటీడీ బోర్టులోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్?

జ్వరంతో బాధపడుతున్న పవన్.. ఈ సభకు హాజరుకావడం కష్టమేనని కొందరు నేతలు చెబుతున్నమాట. కచ్చితంగా వస్తారని మరికొందరు అంటున్నారు. దీంతో వారాహి సభ ఉంటుందా లేదా అనేదానిపై సందిగ్ధంలో పడ్డారు జన సైనికులు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×