E-Paper
Advertisement

Pawan Kalyan: పోలవరం నిర్వాసితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం

Pawan Kalyan: పోలవరం నిర్వాసితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం
Advertisement

Pawan Kalyan: ఏపీ సీఎం జగన్‌‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ కథలు చెబుతున్నారని ఆరోపించారు. పోలవరం నియోజకవర్గం కొయ్యల గూడెం వారాహి విజయభేరి సభలో పాల్లొన్న పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులకు ఆయన రూ.కోటి విరాళం ప్రకటించారు.

పోలవరం ప్రాంతానికి కరాటం రాంబాబు కుటుంబం ఎంతో మేలు చేసిందని అన్నారు. తాను పార్టీ పెట్టిన నాటి నుంచి తన భుజం తట్టి ఆయన పోత్సహించారని తెలిపారు. సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు కొంత వరకు పూర్తయిందంటే..అందుకు కారణం కరాటం రాంబాబు కుటుంబం అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం వారు 110 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తు చేశారు.

Advertisement

Also Read:ముద్రగడ ఛాలెంజ్, పవన్‌ ఓటమి ఖాయం, లేకపోతే

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తయ్యాయని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరంపై కథలు చెబుతున్నారని విమర్శించారు. పునరావాస ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పి అందరినీ నమ్మించారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు గురించి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిని అడిగితే నాకేం తెలుసు అంటారు..అందుకేనా మంత్రి పదవి ఇచ్చింది ? డ్యాన్సులు వేయడానికా..అంటూ ఫైర్ అయ్యారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×