E-Paper
Advertisement

Pawan Kalyan: ‘సిద్ధం సిద్ధం అంటున్నారుగా.. ఇదిగో ఇక యుద్ధం మొదలైంది’: పవన్ కల్యాణ్

Pawan Kalyan: ‘సిద్ధం సిద్ధం అంటున్నారుగా.. ఇదిగో ఇక యుద్ధం మొదలైంది’: పవన్ కల్యాణ్
Advertisement

 

pawankalyan

Advertisement

Pawan Kalyan Satires on CM Jagan: వచ్చే ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌‌లు కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల కోసం తాము సిద్దం అని వైసీపీ జగన్ అంటున్నారని, తామూ నేటి జాబితాతో యుద్ధానికి రణభేరి మోగించామని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఈ పొత్తుకు ముందుకొచ్చామని ఆయన ప్రకటించారు.

చాలా మంది జనసేన 60 లేదా 70 సీట్లు కోరాలని తనకు సూచించారనీ, కానీ.. గత ఎన్నికల్లో కనీసం తమ పార్టీ 10 సీట్లైనా గెలిచి ఉంటే.. తాను అలా అడగగలిగే వాడినని తెలిపారు. ఇప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదనీ, తాము తీసుకున్న సీట్లలో టీడీపీ, జనసేన పార్టీలు అదిరిపోయే రిజల్ట్ చూపించాల్సి ఉందన్నారు. బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో జనసేన కొంత సర్దుకుపోయే ధోరణిని అనుసరించిందని వివరించారు.

Advertisement

జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక స్థానం ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు. అలాగే.. టీడీపీ ఉన్నచోట ప్రతి జనసేన ఓటు టీడీపీకి, జనసేన బరిలో నిలిచిన స్థానాల్లో ప్రతి టీడీపీ ఓటు జనసేనకు బదిలీ అయితేనే.. ఈ పొత్తు ఫలిస్తుందని, ఈ క్షణం నుంచి రెండు పార్టీల కార్యకర్తలు అదే పనిలో ఉండాలని సూచించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×