E-Paper
Advertisement

Pawan Kalyan: రోడ్డు లేక విద్యార్ధుల ఇక్కట్లు.. కదిలిన డిప్యూటీ సీఎం.. ఆగమేఘాలపై ఆదేశాలు

Pawan Kalyan: రోడ్డు లేక విద్యార్ధుల ఇక్కట్లు.. కదిలిన డిప్యూటీ సీఎం.. ఆగమేఘాలపై ఆదేశాలు
Advertisement

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. ‘పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి’ అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశంపై ఆయన చలించిపోయారు. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసి కదిలిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు.

వివరాల్లోకి వెళ్తే.. 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురద రోడ్డులో స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ ఇటీవల సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. ఈ విషయం శుక్రవారం పవన్ దృష్టికి వచ్చినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం ఎక్స్ వేదికగా పేర్కొంది.

కలెక్టర్‌కు ఫోన్.. కీలక ఆదేశాలు

Advertisement

విద్యార్థుల అవస్థలు చూసి చలించిపోయిన పవన్.. వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఆ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంచనాలు రూపొందించి తక్షణమే రహదారి మంజూరు చేయాలని ఆదేశించారు. 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరిపోనున్నాయి.

నెల్లూరు జిల్లాలో భారీగా రోడ్ల నిర్మాణం

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.

Advertisement

Also Read: Human Interest Story: పెళ్లి కోసం 97 ఏళ్ల వృద్ధుడి పోరాటం.. కొడుకుపై గెలిచి.. ప్రేయసిని దక్కించుకొని..!

సాస్కీ నుంచి రూ.9 కోట్లు..

సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు రోడ్ల కోసం వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయని డిప్యూటీ సీఎం కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది.

Also Read: Medaram Jatara 2026: మేడారం భక్తుల వింత కోరికలు.. నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి భయ్యా!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×