E-Paper
Advertisement

Pawan Kalyan: రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్.. 35 రోజుల్లోనే పనులకు శ్రీకారం

Pawan Kalyan: రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్.. 35 రోజుల్లోనే పనులకు శ్రీకారం
Advertisement

Pawan Kalyan: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు మంగళవారం ఆయన శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో పవన్ కళ్యాణ్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు.

గతంలో రాజోలు పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడి రైతులు డ్రెయిన్ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల కష్టాలను చూసి చలించిన ఆయన, 45 రోజుల్లోగా శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం, గడువు కంటే ముందే.. అంటే కేవలం 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో నిధులు మంజూరై పనులు ప్రారంభం కావడంతో కోనసీమ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఇక క్షేత్రస్థాయిలో శంకరగుప్తంలో జరిగిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.

Read Also: Vijayawada News: అరెస్టు భయం.. అజ్ఞాతంలోకి వైసీపీ నేత వల్లభనేని వంశీ, మళ్లీ ఏమైంది?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×