E-Paper
Advertisement

Pawan Kalyan : అన్న బాటలో నడుస్తున్న పవన్ కళ్యాన్.. ఈ రోజుల్లో అది అవసరమే!

Pawan Kalyan : అన్న బాటలో నడుస్తున్న పవన్ కళ్యాన్.. ఈ రోజుల్లో అది అవసరమే!
Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రాజకీయాల్లో చాలా చురుకుగా రాణిస్తున్నారు.ప్రతిపక్షాలు ఆయన్ను ఎంతగా విమర్శించినా ఏమాత్రం వాటిని లెక్క చేయకుండా పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. తప్పు చేసింది జనసైనికులు అనితెలిసినా వారికి ఎలాంటి మినహాయింపు ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఆయనకు విమర్శలు తప్పడం లేదు.రాజకీయాల్లో విమర్శలు కామన్. కానీ, ఆయన్నుకొందరు పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని జనసైనికులు అంటున్నారు. రాజకీయాలు, సినిమాలు వేరు అని పవన్ ఎప్పుడో చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

జీరో టు డిప్యూటీ సీఎం..

కానీ, 2019 ఎన్నికల్లో ఆయన రెండూ చోట్ల ఓడిపోవడం, పార్టీని నడిపించేందుకు సినిమాలు చేయక తప్పలేదని ఆయనే చెప్పుకొచ్చారు. నిజాయితీగా తాను చేసిన పనిని ఒప్పుకునే పవన్.. రాజకీయాల్లో అంత నిజాయితీగా ఉండగలరా?అని చాలా మందే ప్రశ్నలు సంధించారు. పార్టీ పెట్టి దాదాపు పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే స్థానం లేకున్నా ప్రజల కోసం కొట్లాడారు. వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయన్ని తనదైన శైలిలో ప్రశ్నించారు.ప్రభుత్వానికి, అవినీతి పాలనకు ఎదురుతిరిగారు.కట్ చేస్తే 2024 ఎన్నికల్లో కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

చిరంజీవి దారిలోనే పవన్..!

Advertisement

తన అన్న చిరంజీవి రాజీకీయాల్లోకి వచ్చినా పెద్దగా రాణించలేకపోయారు. వైఎస్సార్ టైంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్.. తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో సుమారు 18 స్థానాలను గెలుపొందారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలతో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రిగా పనిచేసి రాజకీయాలకు దూరమై సినిమాలు చేస్తున్నారు. పవన్ కూడా అలాగే పార్టీ స్థాపించిన కొత్తలో అధికారం లేకున్నా సినిమాలు చేస్తూ అధికారంలోకి వచ్చారు. ఈ మధ్య కొందరు ప్రతిపక్ష నేతలు ఆయన్ను చిరంజీవితో పోలుస్తారు.వచ్చే ఎన్నికల్లో జనసేన ఓటమి తప్పదని, ఆయన కూడా చిరంజీవి లాగా రాజకీయాలకు దూరమై సినిమాలకు పరిమితం అవుతారని కొందరు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

అయితే, పవన్ మాత్రం ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిసింది. ఆయనకు సీఎం చంద్రబాబు కేటాయించిన శాఖలతో పాటు మిగతా అభివృద్ది పనులపై ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. పవన్ రాజకీయాల్లో ఏనాడూ తన అన్న మార్గంలో నడవలేదని జనసైనికులు సైతం చెబుతున్నారు.కానీ, ఇటీవల తన అన్న చిరులాగే పవన్ సైతం ఓ విషయంలో ఆయన్ను ఫాలో అయ్యారని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ప్రైవసీ, వ్యక్తిత్వ హక్కుల కోసం తన ఫోటోలు అనుమతి లేకుండా కంపెనీలు, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వాడకుండా చూడాలని పవన్ హైకోర్టును ఆశ్రయించారు. కొందరు తన ఫొటోను వాడుతూ జనాలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం. ఇటీవల చిరు సైతం అలాగే కోర్టును ఆశ్రయించగా.. అనుమతి లేకుండా చిరంజీవి ఫోటోలు, వీడియోలు వాడరాదని కోర్టు తీర్పునిచ్చింది.

Advertisement

 

 

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×