E-Paper
Advertisement

Pawan Kalyan : ఒకటికి వంద సార్లు ఆలోచించుకో.. ఈ సారి వదిలేదే లేదు.. పవన్ ఆగ్రహం

Pawan Kalyan : ఒకటికి వంద సార్లు ఆలోచించుకో.. ఈ సారి వదిలేదే లేదు.. పవన్ ఆగ్రహం
Advertisement

Pawan Kalyan : ఎవరినైనా దూషించే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకో..లేదంటే కర్మ వదిలిపెట్టదు… ఇదేదో సినిమాలో డైలాగ్ కాదు. సోషల్ మీడియాలో పోస్టులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరిక. కేవలం తమ అభిమాన నాయకులకు వ్యతిరేకంగా రాజకీయాల్లో ఉన్నారనో, ఏవైనా విషయాల్లో విభేదిస్తే చాలు.. ప్రతివిమర్శల పేరుతో నాయకుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని తిడుతూ, ఇస్టారాజ్యంగా కామెంట్లు, పోస్టులు పెట్టేవారికి.. జనసేనాని ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఏమైనా అనే ముందు ఆలోచించుకో అంటూ.. పవర్ ఫుల్ డైలాగ్ తో ఆదివారం రాత్రి ఎక్స్ (ట్విట్టర్) (Twitter)లో పోస్ట్ పెట్టారు.

ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక విమర్శలు ఆరోగ్యకరమన్న పవన్ కళ్యాణ్… దూషించడం, హత్యలు, అత్యాచార బెదిరింపులు సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో మనమంతా వివిధ అంశాలపై విభేదించవచ్చు.. అసమ్మతి వ్యక్తం చేయవచ్చు కానీ, ఇది విధానాల వరకే పరిమితం కావాలని సూచించారు. ఆయా విషయాల్ని వ్యక్తిగతంగా తీసుకోవడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని అన్నారు.

Advertisement

రాజకీయాల్లో నాయకుల కుటుంబాలు, వ్యక్తులను లాగడం ఏంటని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. కుల దూషణలు, ఎదుటి వ్యక్తుల విశ్వాసాలను దెబ్బతీయడం లాంటి వాటితో పాటు దేవుళ్లపై దాడి చేసేలా వారి ప్రవర్తన ఉండొద్దని అన్నారు. కండబలం, ధనబలం, క్రిమినల్‌ గ్యాంగులతో ఈ దేశంలోని సగటు భారతీయుడిని బెదిరించలేరు అంటూ పరోక్షంగా వైసీపీని హెచ్చరించారు జనసేనాని పవన్ కళ్యాణ్. అందుకే.. క్రిమినల్ ముఠాలు, గత ప్రభుత్వ హయాంలో సోషల్‌ మీడియా దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఒకటే చెబుతున్నా ‘దూషించే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోండి.. కర్మ వదలిపెట్టదు’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×