E-Paper
Advertisement

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు
Advertisement

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పలమనేరు మండలం ముసలిమడుగులో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం, హెలిప్యాడ్‌కు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పవన్‌ను చూసేందుకు స్థానికులు, అభిమానులు ఒక్కసారిగా ఆయన కాన్వాయ్ ముందుకు దూసుకురావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ గందరగోళంలో ఓ మహిళ కిందపడిపోగా, ఆమె కాలిపై నుంచి కాన్వాయ్‌లోని ఓ వాహనం వెళ్లింది. గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను పక్కకులాగి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఆదివారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలమనేరు మండలం ముసలిమడుగు పర్యటనలో మహిళ గాయపడిన ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టత ఇచ్చారు. కాన్వాయ్ వాహనం ఆమె కాలిపై నుంచి వెళ్లిందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు. జనాల తాకిడికి, తోపులాటలో ఆమె స్పృహతప్పి కిందపడిపోయి గాయపడినట్లు తెలిపారు.

Advertisement

కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. “గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ వెళ్లే దారిలో ఉన్న మహిళ, జనాల తాకిడికి జరిగిన తోపులాటలో స్పృహతప్పి కిందపడిపోయారు. ఆ తొక్కిసలాటలో ఆమె ఎడమ కాలికి గాయం అయింది” అని కలెక్టర్ వివరించారు.

గాయపడిన మహిళను వెంటనే పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించామని, అక్కడ ఆర్థోపెడీషియన్ పర్యవేక్షణలో అన్ని పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పరీక్షల్లో ఆమె ఎడమ కాలికి చిన్నపాటి గాయంగానే నిర్ధారణ అయిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. క్షతగాత్రురాలికి మెరుగైన వైద్య చికిత్స అందించడంలో జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారం అందిస్తుందని కలెక్టర్ సుమిత్ కుమార్ హామీ ఇచ్చారు.

Advertisement

కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పలమనేరు మండలం ముసలిమడుగలో 20 ఎకరాల్లో దీని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులు తెచ్చినట్లు పవన్ కళ్యాణ్ కు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం పవన్ కళ్యాణ్ స్వయంగా ఎనుగుల విన్యాసాలను వీక్షించారు. ఎనుగులను చూసి ఆనందం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్, అడవుల సంరక్షణలో కుంకీ ఎనుగుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

 

 

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×