E-Paper
Advertisement

Pawan Kalyan Comments Grandhi Srinivas: రౌడీ చేతిలో భీమవరం బందీ.. వైసీపీ ఎమ్మెల్యేను ఓడించాలని పవన్ కల్యాణ్ పిలుపు

Pawan Kalyan Comments Grandhi Srinivas: రౌడీ చేతిలో భీమవరం బందీ.. వైసీపీ ఎమ్మెల్యేను ఓడించాలని పవన్ కల్యాణ్ పిలుపు
Advertisement

Pawan kalyan bhimavaram meeting

Pawan Kalyan Bhimavaram Meeting: ఏపీలో వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా జనసేనలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేరారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన గతంలో భీమవరం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.

Advertisement

భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. కుబేరులు ఎక్కువగా ఉండే భీమవరం రౌడీ చేతిలో బందీగా మారిందని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిన అరాచకాల ప్రభావం అతని కులంపై పడుతోందన్నారు.

భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ను ఓడించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. భీమవరాన్ని తాను వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. ఇక్కడ నుంచి రౌడీయింజ పోయే వరకు పోరాడతానని తేల్చిచెప్పారు. జనసేన అభ్యర్థిని గెలిపిస్తే భీమవరంలో డంపింగ్ యార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: బీజేపీ కోసం తగ్గిన జనసేన.. పొత్తులో మారిన సీట్ల లెక్కలు.. ఎవరికెన్నంటే..

పులపుర్తి రామాంజనేయులు చేరిక జనసేనకు బలాన్ని ఇచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయనే టీడీపీ, జనసేన పొత్తు విషయంలో కీలకంగా మారారని తెలిపారు. 2019 ఎన్నికల్లో భీమవరంలో తాను ఓడిపోయినా జనం మద్దతుగా నిలిచారని చెప్పారు.

రాజకీయాల్లో యుద్ధమే ఉంటుందని జనసేనాని స్పష్టం చేశారు. బంధుత్వాలు ఉండవన్నారు. అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చడమేనని స్పష్టంచేశారు. వైసీపీ నేతలు చేస్తున్న దాడులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మే 15 లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధం.. సిద్ధం అని కోకిలలా కూస్తున్న జగన్ ఓడిద్దామన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×