E-Paper
Advertisement

Pawan Kalyan : మంచితనం ఎక్కువైపోయింది.. వాళ్లను పాకిస్తాన్ పంపేద్దాం..

Pawan Kalyan : మంచితనం ఎక్కువైపోయింది.. వాళ్లను పాకిస్తాన్ పంపేద్దాం..
Advertisement

Pawan Kalyan : యుద్ధం పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ జనసేనాని పిలుపు ఇచ్చారు. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండాలని.. వారిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నారు. పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా మాట్లాడటం సరికాదని.. అలాంటి వాళ్లు ఆ దేశానికే వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్. పహల్గాం టెర్రర్ అటాక్‌లో చనిపోయిన వారికి జనసేన తరఫున నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రదాడిలో దుర్మరణం పాలైన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ. 50 లక్షలు సాయం అందించారు. జనసేన తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.

అతి మంచి.. అతి సహనం..

Advertisement

కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. కొంతమంది ఇండియాలో ఉండి పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడటంపై మండిపడ్డారు. అతి మంచితనం మంచిది కాదని.. అతి సహనం కూడా ప్రమాదకరమని అన్నారు. పాకిస్తాన్‌ను మూడుసార్లు ఓడించామనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. హిందువులకు ఉన్నది ఒక్కటే దేశమని.. ఇక్కడ కూడా టార్గెట్ చేస్తే ఇంకెక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి పాలనలో..

Advertisement

ఐడీ కార్డులు అడిగి.. హిందువా? ముస్లింవా? అని తెలుసుకుని మరీ దారుణంగా చంపేశారని.. అమాయకులైన నిరాయుధుల ప్రాణాలు తీశారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉందని.. అధికారం రాష్ట్రం చేతిలోకి వెళ్లగానే ఇలా ఉగ్రవాదులు రెచ్చిపోయారని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు జనసేనాని. ఉగ్రవారం, హింసపై ప్రజలంతా ఒకేలా స్పందించాలని.. సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలన్నారు పవన్ కల్యాణ్.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×