E-Paper
Advertisement

Pawan Kalyan: వాహ్ పవన్ కళ్యాణ్.. ఇది కదా రాజకీయ హుందాతనం

Pawan Kalyan: వాహ్ పవన్ కళ్యాణ్.. ఇది కదా రాజకీయ హుందాతనం
Advertisement

Pawan Kalyan: రాజకీయంగా హుందాతనం ప్రదర్శించడం అంటే ఇదేనేమో..! రాజకీయ పరంగా ఎంతటి తీవ్ర విభేదాలున్నా, వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడమే నిజమైన ప్రజాస్వామ్య రాజకీయాల లక్షణమని ఆయన తన చర్యల ద్వారా నిరూపించారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టు చేశారు.

రాజకీయ వేదికలపై పవన్ కళ్యాణ్, జగన్ మధ్య విమర్శలు, ఆరోపణలు కొత్తేమీ కాదు. అధికార, ప్రతిపక్ష పాత్రల్లో ఉన్నప్పుడు విధానాలపై, పరిపాలన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అయితే అవన్నీ రాజకీయ సిద్ధాంతాలకు, పాలనకు సంబంధించినవే తప్ప వ్యక్తిగత ద్వేషంతో కాదని పవన్ కళ్యాణ్ తన తాజా పోస్టుతో పరోక్షంగా స్పష్టం చేశారు. జగన్‌కు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Advertisement

ఈ తరుణంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన శుభాకాంక్షల సందేశం వైసీపీ శ్రేణుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. పార్టీలు వేరైనా తమ అభిమాన నటుడు మంచితనం నిరూపించుకున్నారని అనుకుంటున్నారు. విబేధాలు రాజకీయంగానే తప్ప వ్యక్తగతంగా కాదనే సందేశాన్ని ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ప్రధాని మోదీ కూడా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధినేత్రికి ఇదే విధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారనే విషయాన్ని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

వైయస్ జగన్ నేడు తన జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. పార్టీ కార్యాలయాల వద్ద, జిల్లాల కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు.

Advertisement

Also Read: జగన్ పుట్టినరోజు నేడు.. బెడిసికొట్టిన నేతల ప్లాన్, విమానంలో ‘షో’, ఏం జరిగింది?

జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులు, అభిమానులు, పార్టీ శ్రేణుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×