E-Paper
Advertisement

Pawan Kalyan: ఫ్యాన్ పేజీలు, వెబ్‌సైట్లపై పవన్ సీరియస్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

Pawan Kalyan: ఫ్యాన్ పేజీలు, వెబ్‌సైట్లపై పవన్ సీరియస్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
Advertisement

Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, అనధికారిక వ్యాపారాలపై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పరిరక్షణ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను కాపాడేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో కొందరు ‘ఫ్యాన్ పేజీల’ ముసుగులో పవన్ పేరు, ఫొటోలు, వీడియోలను వాడుతూ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని కోర్టు గుర్తించింది. అలాగే కొన్ని వెబ్‌సైట్లు ఆయన అనుమతి లేకుండా, ఆయన చిత్రంతో కూడిన వస్తువులను (Merchandise) విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయని, ఇది అనధికారిక దోపిడీ కిందకు వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఇలా చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేస్తూ, తక్షణమే అటువంటి చర్యలను అడ్డుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.

Advertisement

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీ పెరిగాక సెలబ్రిటీల ఇమేజ్‌ను దుర్వినియోగం చేయడం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కంటే ముందే టాలీవుడ్ అగ్ర హీరోలు అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా తమ వ్యక్తిత్వ హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా తమ పేరు, ఫొటో, గొంతును వాణిజ్యపరంగా లేదా తప్పుదోవ పట్టించేలా వాడకూడదని వారు కోర్టు నుంచి ఉత్తర్వులు పొందారు. ఇప్పుడు పవన్ కూడా అదే బాటలో నడవడంతో, సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి క్రేజ్‌ను వాడుకునే సంస్థలకు, సోషల్ మీడియా ఖాతాలకు గట్టి హెచ్చరిక వెళ్లినట్లయింది.

Read Also: AP NEWS: ఉత్తరాంధ్రపై జనసేన ఫోకస్.. పవన్ ప్లాన్ ఇదేనా!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×