E-Paper
Advertisement

ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఏపీ టు పుదుచ్చేరికి వెళ్లే పలు రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే

ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఏపీ టు పుదుచ్చేరికి వెళ్లే పలు రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే
Advertisement

Train Travelers: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో ఏపీ నుంచి పుదుచ్చేరి వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దు అయ్యాయి. నిర్వహణ కారణాల నేపథ్యంలో పుదుచ్చేరి మార్గంలో నడిచే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు తెలిపింది.

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్

Advertisement

పలు కారణాల నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్ల సర్వీసుల్లో మార్పులు జరిగాయి. ముఖ్యంగా నిర్వహణ కారణాల నేపథ్యంలో పుదుచ్చేరి మార్గంలో నడిచే ఐదు రైళ్లను ముందస్తుగా నిలిపి వేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. జూలై నెలలో వివిధ తేదీల్లో ఈ మార్పులు ఉండనున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించిన వివరాల మేరకు.. కాకినాడ, తిరుపతి, న్యూఢిల్లీ నుంచి పుదుచ్చేరి వెళ్లే రైళ్లతోపాటు హౌరా ఎక్స్‌ప్రెస్ సర్వీసులపై దాని ప్రభావం పడనుంది.

కాకినాడ-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలును జూలై 11, జూలై 13 తేదీల్లో ప్రయాణించాల్సిన చెంగల్పట్టు వద్ద నిలిచిపోతుంది. చెంగల్పట్టు -పుదుచ్చేరి మధ్య పలు రైళ్ల సర్వీసును పాక్షికంగా రద్దు చేశారు. తిరుపతి-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ జూలై 12 నుంచి 15 వరకు, జూలై 17-18 తేదీల్లో నడిచే ఈ రైలు ముండియం పాక్కం వరకు నడుస్తుంది. ముండియంపాక్కం-పుదుచ్చేరి మధ్య ఈ సర్వీస్ అందుబాటులో ఉండదు.

Advertisement

ఏపీ టు పుదుచ్చేరికి వెళ్లే పలు రైళ్లు రద్దు

తిరుపతి-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ జూలై 4, 8, 25, 29 తేదీల్లో ఈ రైలును విల్లుపురం వద్ద నిలిపివేస్తారు. అలాగే విల్లుపురం-పుదుచ్చేరి మధ్య ఈ రైలును పాక్షికంగా రద్దు చేశారు అధికారులు. పుదుచ్చేరి-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జూలై 15న నడవాల్సిన ఈ రైలు పుదుచ్చేరికి బదులు విల్లుపురం నుంచి మొదలుకానుంది. పుదుచ్చేరి-విల్లుపురం మధ్య ఈ సర్వీసును రద్దు చేశారు.

న్యూఢిల్లీ-పుదుచ్చేరి వీక్లీ ఎక్స్‌ప్రెస్ జూలై 12న ప్రయాణించాల్సిన ఈ వీక్లీ రైలు విల్లుపురం వద్ద నిలిచిపోనుంది. విల్లుపురం – పుదుచ్చేరి మధ్య ఈ రైలును పాక్షికంగా నిలిపివేశారు. ఆయా తేదీల్లో ట్రావెల్ చేసే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బయలుదేరే ముందే రైళ్ల తాజా రన్నింగ్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని సూచన చేశారు రైల్వే అధికారులు.

ALSO READ: చంద్రబాబు ఫ్యామిలీ సీక్రెట్స్ బయటపెట్టిన అంబటి.. ఆ ఆస్తి లోకేష్ పేరిట ఎలా రాశారు?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×