E-Paper
Advertisement

Parakamani Theft Case: టీటీడీ పరకామణి చోరీ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు, సాక్షులు-నిందితుడు సేఫ్

Parakamani Theft Case: టీటీడీ పరకామణి చోరీ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు, సాక్షులు-నిందితుడు సేఫ్
Advertisement

Parakamani Theft Case: టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏం జరుగుతోంది? హైకోర్టు కీలక ఆదేశాల వెనుక ఏం జరిగింది?  సాక్షులు, నిందితుడికి బెదిరింపులు మొదలయ్యాయా? సతీష్‌కుమార్ హత్య నేపథ్యంలో కీలక ఆదేశాలు ఇచ్చిందా? ఇకపై సాక్షులు, నిందితులు విచారణకు హాజరుకావచ్చా? అవుననే సంకేతాలు మొదలయ్యాయి.

టీటీడీ పరకామణి చోరీ కేసు

Advertisement

పరాకామణి చోరీ కేసులో మంగళవారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్ మృతి నేపథ్యంలో  సాక్షులు- నిందితుడు రవికుమార్‌కు పోలీసు రక్షణ కల్సించాలని పేర్కొంది. దర్యాప్తు పూర్తి అయ్యేవరకు వారికి రక్షణ కల్పించాలని సీఐడీని ఆదేశించింది.

టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్ అసహజ మృతిపై తాము షాకింగ్‌కు గురయ్యామని వ్యాఖ్యానించారు న్యాయస్థానం. ఈ కేసు దర్యాప్తులో తనతోపాటు కింది స్థాయి అధికారులు పాల్గొంనేందుకు అనుమతించాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. అందుకు న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను డిసెంబర్ రెండుకి వాయిదా వేసింది న్యాయస్థానం.

Advertisement

కీలక ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు

పరకామణి చోరీ కేసు కీలక మలుపు తిరగనుంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే చాలామందికి నోటీసులు ఇచ్చింది సీఐడీ.  ఈ కేసులో కీలక నేతల ప్రమేయం ఉన్నట్లు వార్తలు లేకపోలేదు. ఫిర్యాదు చేసిన టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్ మృతి చెందారు.  తొలుత ఆయనది ఆత్మహత్యగా అనుకున్నా, అది ముమ్మాటికీ హత్యనని సీఐడీ భావిస్తోంది. దీంతో సతీష్ మృతి కేసు లోతుగా దర్యాప్తు చేస్తోంది.

ALSO READ:  ఏపీ ప్రభుత్వానికి రాజధాని రైతులు అల్టిమేటం

కీలక సాక్షి మృతి చెందడంతో చాలామందిని సాక్షి చెప్పడానికి వెనుకడుగు వేసినట్టు వార్తలు లేకపోలేదు. ఈ విషయం బయటపెట్టినందుకు టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, తనను వేధింపులకు గురి చేశారని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. తనకు బెదిరింపులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ కేసు దర్యాప్తు జోరందుకోనుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×