E-Paper
Advertisement

Parakamani Case: సతీష్ కుమార్ మృతిని వైసీపీ మాత్రమే ఆత్మహత్యగా చిత్రీకరిస్తుంది: ఆళ్లపాటి రాజా

Parakamani Case: సతీష్ కుమార్ మృతిని వైసీపీ మాత్రమే ఆత్మహత్యగా చిత్రీకరిస్తుంది: ఆళ్లపాటి రాజా
Advertisement

Parakamani Case: టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చాలా బాధకరమని టీడీపీ ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజా అన్నారు. సతీష్ కుమార్ మృతిని వైసీపీ వాళ్లు మాత్రమే ఆత్మహత్య గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సతీష్ కుమార్, టీటీడీ ఉద్యోగి రవికుమార్ మధ్య ఎలా రాజీ కుదిర్చారు, టీటీడీ డబ్బులు పోతే కాంపౌండబుల్ అఫెన్స్ గా ఎలా మార్చి, రాజీ చేశారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ఖ్యాతిని దిగజార్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కల్తీ మలినం పోకముందే పరకామణి ఇష్యూ బయటకు వచ్చిందన్నారు.

వైసీపీ ఎంత దారుణాన్ని ఒడిగట్టేందుకు అయినా వెనుకాడదని ఆళ్లపాటి రాజా ఆరోపించారు. అసలు కర్త, కర్మ, క్రియా ఎవరనే విషయం బయటకు తెచ్చేందుకే హైకోర్టు సీఐడీ విచారణకు ఆదేశించిందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, వైసీపీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటి భయటకు వస్తున్నాయన్నారు.

పరకామణి కేసులో కీలక వ్యక్తి

Advertisement

టీటీడీ పరకామణి కేసులో ఫిర్యాదుదారుడికి ఉన్న సీఐ సతీష్ కుమార్ ఇటీవల తాడిపత్రిలో అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. రైలు పట్టాల సమీపంలో సతీష్ కుమార్ విగతజీవిగా పడిఉన్నారు. పరకామణి కేసును హైకోర్టు సీఐడీకి అప్పగించడంతో.. విచారణ వేగవంతం అయింది. ఈ దశలో ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్ మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది.

సీసీ కెమెరాల ఆధారంగా

టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం వేశారు. సతీష్ కుమార్ ట్రైన్ ఎక్కే ముందు ఓ టీ స్టాల్ లో టీ తాగినట్టు గుర్తించారు. ఆ సీసీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. అప్పటికి సతీష్ కుమార్ మొహంలో ఎలా ఆందోళన కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. ట్రైన్ లో ఏం జరిగి ఉంటుందనే దానిపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ట్రైన్ లో A1,A2,A3 బోగీల్లో ఉన్న ప్యాసింజర్ లిస్ట్ ను పోలీసులు సేకరిస్తున్నారు. ఆ ప్యాసింజర్స్ లో ఎవరైనా నేర చరిత్ర ఉన్నవారు ఉన్నారా? అన్న దానిపై విచారణ చేస్తున్నారు.

Advertisement

Also Read: Satish Kumar Murder Case: సతీష్ కుమార్ హత్యపై డొంక కదిలింది.. గుట్టు అంతా ఫోన్ కాల్స్‌లో

A1 బోగీలో సీట్ నెంబర్ 21లో ఉండాల్సిన సతీష్ లగేజ్ సీట్ నెంబర్ 11 లోకి ఎలా వచ్చిందనే దిశగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. లగేజీ ఆ సీట్లో ఎందుకు ఉందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సతీష్ ఫోన్ కాల్ లిస్ట్ ను పరిశీలిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×