E-Paper
Advertisement

Anakapalli : యథేచ్ఛగా బెట్టింగ్ .. ముగ్గురి అరెస్ట్ ..

Anakapalli : యథేచ్ఛగా బెట్టింగ్ .. ముగ్గురి అరెస్ట్ ..
Advertisement

Anakapalli : ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కి పాల్పడుతున్న ముగ్గురు బుకీలను అనకాపల్లి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి మండలం కొండ కొప్పాక గ్రామంలోని ఒక ఇంట్లో రహస్యంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్టైన వారిలో అనకాపల్లి గవరపాలెంకు చెందిన ఎల్లపు చక్రవర్తి , కాండ్రేగుల జగన్ , పెంటకోట మహేష్ చిన్నాలు ఉన్నారు. వారి వద్ద నుంచి 8 మొబైల్ ఫోన్లు, ఒక లాప్ టాప్, ఒక టీవీ, 11 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

గతంలో బెట్టింగ్ ముఠా వల్ల ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్న కేసు కలకలం సృష్టించింది. ఆ కేసులో కూడా ఎల్లపు చక్రవర్తి అనే వ్యక్తి ముద్దాయిగా ఉన్నాడు. అదే వృత్తిని కొనసాగిస్తూ మళ్ళీ దొరకాడు.

Advertisement

అనకాపల్లిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆగడాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. గతంలో కొంతమందిపై బెట్టింగ్ కేసులు ఉన్నప్పటికీ వారిపై పోలీస్ నిఘా లేకపోవటంతో విచ్చల విడిగా బెట్టింగ్ జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. పోలీసుల చర్యలు నామమాత్రంగా ఉండటంతో బెట్టింగ్ ముఠా ఆగడాలకు హద్దు లేకుండా పోయిందంటున్నారు. బెట్టింగ్ బారినపడి అనేక మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×