E-Paper
Advertisement

RGV investigation : తొమ్మిది గంటలు సాగిన ఆర్జీవీ విచారణ – వెంటనే మరో షాక్ ఇచ్చిన పోలీసులు

RGV investigation : తొమ్మిది గంటలు సాగిన ఆర్జీవీ విచారణ – వెంటనే మరో షాక్ ఇచ్చిన పోలీసులు
Advertisement

RGV investigation : గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద పోస్టులు పెట్టిన కేసులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలసులు విచారిస్తున్నారు. ఫిబ్రవరి 7 న ఉదయం ఒంగోలు పోలీసులు ఎదుట హజరైన ఆర్టీవీ ని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 9 గంటల పాటు విచారణ సాగగా..చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఆర్జీీని అరెస్ట్ చేస్తారని కొంతసేపు, విచారణ మరోరోజుకు పొడిగిస్తారని  మరికొంత సేపు ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. చివరకు రాత్రి 10 గంటల సమయంలో రామ్ గోపాల్ వర్మను పోలీసులు విడిచిపెట్టారు.

విడుదలైన వెంటనే మరో ఝలక్!

Advertisement

ఒంగోలు పోలీసుల ఎదుట హజరై సుదీర్ఘ విచారణ తర్వాత బయటకు వచ్చిన ఆర్జీవీకి మరో ఝలక్ తగిలింది. అప్పుడే విచారణ ముగిసింది అనుకుంటుండగా.. గుంటూరు పోలీసులు అక్కడే మరో నోటీసు అందజేశారు. గతంలో ఆయన తీసిన “అమ్మ రాజ్యంలో కడప రెడ్డు” అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చూపించిన సీన్లు, వాడిన మాటలు సహా సినిమా పేరు సైతం కొన్ని వర్గాలను కించపరిచేదిగా ఉందంటూ గుంటూరు సీఐడీ పోలీసుల దగ్గర కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగా ఈనెల 10న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందించారు.

కేసు వివరాలేంటి..

Advertisement

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో  ఉండగా.. అప్పటి ప్రతిపక్షం టీడీపీ, జనసేనా పార్టీలను, ఆయా పార్టీల అధినాయకుల్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు, సినిమాలు చేశారనే ఆరోపణలున్నాయి.  వైసీపీ కి అనుకూలం సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు సైతం పెట్టినట్లు పలు కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల విషయమై వరుసగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు అందజేస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, అతని తనయుడు నారా లోకేష్, జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ లను అవమానించేలా ఓ మార్ఫింగ్ ఫోట్ సోషల్ మీడియాలో పెట్టారనే కారణంగా..  ఒంగోలు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసులో విచారణకు హాజరుకావాలని గతేడాది నవంబర్ 19 విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అప్పటి నుంచి వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజాగా.. ఒంగోలు పోలీసుల ఫిబ్రవరి 7న కచ్చితంగా హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పడంతో.. రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం హాజరయ్యారు.

Also Read : పోలీస్ స్టేషన్ మెట్లెక్కనున్న ఆర్జీవీ.. అరెస్ట్ తప్పదా? విచారణతో ముగింపా?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×