E-Paper
Advertisement

Man Attempts Live Burial: నేనే భూదేవి పుత్రుడు.. శాంతి కోసం సజీవ సమాధి..? ఎవరు బ్రో నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు..

Man Attempts Live Burial: నేనే భూదేవి పుత్రుడు.. శాంతి కోసం సజీవ సమాధి..? ఎవరు బ్రో నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు..
Advertisement

Man Attempts Live Burial: ప్రకాశం జిల్లా  తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ షాక్‌కి గురయ్యారు. నానే భూదేవి పుత్రుడు అంటూ.. సజీవ సమాధి చేసుకోబోయాడు. దీనికి వాళ్ల కొడుకు కూడా సహరించాడు. ఐదు అడుగుల గుంట తవ్వి రేకులతో తానంతట తాను కవర్ చేసుకున్నాడు. ప్రపంచ శాంతి కోసం సజీవ సమాధిగా అవుతానని ప్రయత్నిస్తూ రేకులు కప్పుకుని ఐదు రోజులుగా ధ్యానం చేస్తున్నాడు కోటిరెడ్డి. ఒంటిపై బట్టలు లేకుండా గతంలోకి ప్రవేశిస్తాను అంటూ నానా హంగామా చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం లో ఓ వ్యక్తి జీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించాడు. కోటిరెడ్డి ఉగాది పండుగ రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నాడు. ఇక 5 గంటల సమయంలో కోటిరెడ్డి తన కుమారుడితో కలసి ఆలయం దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశాడు. ఆ తర్వాత అయిదు అడుగుల మేర గుంట తీసుకుని, ఒంటిపై బట్టలు లేకుండా గుంటలోనికి ప్రవేశించాడు. కోటిరెడ్డి కుమారుడు ఆ గొయ్యిపై పెద్ద రేకు ఉంచి దానిపై మట్టి పోసి పూడ్చి వేశాడు.

Advertisement

షుమారు 5 గంటల పాటు ఆ వ్యక్తి గుంట లోనే ఉన్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. అయితే కోటిరెడ్డి కొడుకు ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీయగా.. ఈ విషయం కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డికి తెలిసి.. మరికొందరు గ్రామస్థులతో కలిసి అక్కడకు వెళ్లి.. అతన్ని బయటకు రావాలని కోరారు. వెంటనే కోటిరెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. అతని దీక్షను భగ్నం చేసి, జీవసమాధి నుండి అతడిని బయటకు తీసి, గుంటను పూడ్చారు. విఠలాపురానికి చెందిన కైపు కోటిరెడ్డి కి గత కొన్ని సంవత్సరాలుగా భూదేవి అమ్మవారు ఒంట్లో కి వస్తుందని, అమ్మవారిపై భక్తితో 30 అడుగుల లోతులో 30 లక్షల రూపాయలతో ఓ గుడిని కూడా నిర్మించాడు. బూదేవి అమ్మవారి విగ్రహానికి నిత్యం పూజలు కూడా చేస్తున్నాడు. ఉగాది రోజు అతను జీవాసమాది అవుతున్నడంటూ గ్రామస్తులకు తెలియడంతో చూసేందుకు గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకున్నారు.

Advertisement

Also Read: నాగర్ కర్నూల్‌లో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం

కోటిరెడ్డి గుంటలో కూర్చుని దీక్ష చేపట్టిన కొన్ని గంటల్లోనే పోలీసులు వచ్చి జీవసమాది నుండి బయటకి తీశారు. ప్రపంచం లోనే భూదేవి అమ్మవారి ఆలయం ఎక్కడా లేదని, మొట్టమొదటి సారిగా ఆంద్ర ప్రదేశ్ లో నేనే నిర్మించానని అతడు చెప్తున్నాడు. తన పేరే భూదేవి పుత్రుడినని, ప్రపంచ శాంతి కొసమే, ఈ దీక్ష చేపట్టినట్లు ఆ భక్తుడు తెలిపాడు.

 

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×