E-Paper
Advertisement

Tirumala News: తిరుమలలో కొత్తజంటకు అదేం పని.. రకరకాల భంగిమల్లో షూట్‌, ఆపై భక్తుల ఆగ్రహం

Tirumala News: తిరుమలలో  కొత్తజంటకు అదేం పని.. రకరకాల భంగిమల్లో షూట్‌, ఆపై భక్తుల ఆగ్రహం
Advertisement

Tirumala News: తిరుమల పేరు చెబితే చాలు మనసంతా పులకరిస్తుంది. ఆ క్షేత్రానికి వెళ్తే అన్నిమరిచిపోతాము. గోవింద నామస్మరణలతో ఏడు కొండలు నిత్యం మార్మోగుతుంటాయి. కానీ కొందరు అవేవీ పట్టించుకోలేదు. ఆధ్మాత్మిక ప్రాంతాన్ని కొందరు భక్తులు అపవిత్రం చేస్తున్నారు. చేతిలో కెమెరాలు పట్టుకుని ఫోటోషూట్ల కోసం ఎగబడుతున్నారు.

తిరుమలను అపవిత్ర చేస్తున్న కొందరు భక్తులు

Advertisement

తాజాగా శ్రీవారి ఆలయ పరిసరాల్లో కొత్త జంట ఫోటో‌షూట్ చేయడం వివాదానికి దారి తీసింది. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఓ కొత్త జంట రెచ్చిపోయింది. పుణ్యక్షేత్రానికి వచ్చామన్న విషయాన్ని మరిచిపోయింది. అక్కడ భక్తులంతా తమ వైపు చూడాలని భావించింది. ఈ క్రమంలో ఫోటోషూట్ చేయడం వివాదానికి కారణమైంది.

గొల్ల మండపం నుండి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఆ జంట వివిధ భంగిమల్లో ఫోటోలు దిగుతూ షూట్ చేయడం వివాదానికి కేంద్రమైంది. తొలుత భక్తులు దర్శనానికి వెళ్తే ద్వారం వద్ద రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీవారి పరిసరాల్లో పలు ప్రాంతాలు సందర్శించారు. చివరకు స్వామి ఆలయానికి ఎదురుగా ఫోటోలు, ముద్దులు ఇస్తూ షూట్ చేశారు.

Advertisement

నిషేధం ఉన్నా రెచ్చిపోతున్న కొత్తజంటలు, భక్తులు ఆగ్రహం

తిరుమలలో నిత్యం వందలాది సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. సెక్యూరిటీ కూడా ఓ రేంజ్‌లో ఉంటుంది. వారిని ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. కొత్త జంటల చేసే ఇలాంటి పనుల వల్ల తిరుమలకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అంటున్నారు. తిరుమలలో కొత్తగా పాలకమండలి వచ్చిన తర్వాత రకరకాల పనులకు శ్రీకారం చుట్టింది.

తిరుమలలో ఫోటో షూట్లు, రీల్స్ చేయడంపై నిషేధం. ఈ మేరకు బోర్డు కూడా ఆమోదించింది. రాజకీయ ప్రసంగాలు చేసే నేతలపై కేసులు నమోదు చేశారు. అక్కడ నిషేధమున్నా భద్రతా సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి చర్యలపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.

ALSO READ: అజ్ఞాతంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. ఫోన్ స్విచ్ఛాఫ్, కమిటీ ముందుకొస్తారా?

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×