E-Paper
Advertisement

Vizag Loan APP Incident: 2 వేలు లోన్ తీర్చలేదని.. భార్య ఫోటోలతో దారుణంగా

Vizag Loan APP Incident: 2 వేలు లోన్ తీర్చలేదని.. భార్య ఫోటోలతో దారుణంగా
Advertisement

విశాఖలోని మహారాణిపేటకు చెందిన నరేంద్ర అనే యువకుడు లోన్ యాప్స్ ద్వారా అప్పు తీసుకున్నాడు. రెండు వేల రూపాయల మినహా తీసుకున్న అప్పు మొత్తం చెల్లించాడు. కానీ.. ఆ రెండు వేల కోసమే నిర్వాహకులు వేధించడం మొదలు పెట్టారు. వరుస కాల్స్, మెసేజులతో బెదిరింపు కాల్స్ వచ్చాయి. డబ్బులు చెల్లించకపోతే మార్ఫింగ్ ఫోటోలను కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిస్తామని వార్నింగ్‌లు ఇచ్చేవారు. అయితే బెదిరింపుల వరకే పరిమితం కాలేదు. అన్నట్టుగానే బాధితుడి ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్‌కి మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు పంపించేశారు.

Advertisement

స్నేహితులు, బందువులతో పాటు మార్ఫింగ్ ఫోటోలు నరేంద్ర కుటుంబ సభ్యులకు అతని భార్యకు కూడా వెళ్లాయి. దీంతో ఆయన మనస్తాపానికి గురైయ్యాడు. ఫ్యామిలీ ముందు మొహం చూపించలేక శనివారం అర్ధరాత్రి భార్య నిద్రలో ఉండగా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Also Read:  వాళ్ల గొడవల్లో.. వీళ్లు వేలు పెడుతున్నారు, అరె ఏంట్రా ఇది!

Advertisement

బాధితుడి ప్రేమించిన అమ్మాయిని 40 రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. భార్య, భర్తలు ఇద్దరూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు రోజులుగా నరేంద్ర విచారంగా ఉండటాన్ని అతని భార్య గ్రహించింది. దీంతో ఏం జరిగిందని ఆరా తీసింది. దీంతో.. లోన్ యాప్‌కు 2 వేలు బాకీ పడ్డానని.. వాళ్లు వేధిస్తున్నారి బాధితుడు తన భార్యకు చెప్పాడు. ఆమె తన దగ్గరున్న 2 వేలు రూపాయలు ఇవ్వడంతో ఆ అప్పు తీర్చేశాడు. అయితే.. అప్పటికే నిర్వాహకులు మార్ఫింగ్ ఫోటోలు అందరికి పంపిచేశారు. దీంతో మరణం మినహా మరో దారి లేదనుకొని నరేంద్రం సూసైడ్ చేసుకున్నాడు.

కేవలం రెండు వేల రూపాయలకు ఇన్ని వేధింపులు అవసరమా అన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అసలు ఇలాంటి యాప్స్ ప్రభుత్వాలు ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నాయి? ఇంకెంత మంది బలికాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×