E-Paper
Advertisement

Visakha Metro : అందాల విశాఖకు మెట్రో హంగులు.. త్వరలోనే నిర్మాణాలు ప్రారంభం

Visakha Metro : అందాల విశాఖకు మెట్రో హంగులు.. త్వరలోనే నిర్మాణాలు ప్రారంభం
Advertisement

Visakha Metro : 

⦿ విశాఖ వాసులకు గుడ్ న్యూస్
⦿ త్వరలోనే విశాఖకు మెట్రో రైలు
⦿ ప్రకటించిన మంత్రి నారాయణ
⦿ కేంద్రం ఆమోదం తెలపగానే పనులు షురూ
⦿ మెట్రో నిర్మాణ ఖర్చులన్నీ కేంద్రమే భరించేలా
⦿ వినతి పత్రం సమర్పించామన్న మంత్రి నారాయణ
⦿ 46.2 కి.మీలతో నిర్మానం మొదటి ఫేజ్ పనులు

Advertisement

విశాఖపట్నం, స్వేచ్ఛ:

త్వరలోనే విశాఖపట్నంకు మెట్రో రైలు(Metro Train) పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ(Minister Narayana) స్పష్టంచేశారు. శుక్రవారం శాసనమండలిలో మంత్రి నారాయణ ఈ విషయంపై మాట్లాడారు. కేంద్రం అనుమతులు రాగానే ఆలస్యం లేకుండా ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయన్నారు. అయితే మెట్రో నిర్మాణానికయ్యే నిధులు వంద శాతం కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరామని అన్నారు. మొత్తం మూడు కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి ఫేజ్ పనులను 46.2 కి.మీలతో నిర్మాణం చేపట్టనున్నామన్నారు. కాగా స్థానిక ఎమ్మెల్యేలు(Local MLA’s) తగిన మార్పులు, చేర్పులు సూచించారు.

Advertisement

ప్రతిపాదనలు

విశాఖ కారిడార్(Visakha Corridar) లో మొత్తం 14 జంక్షన్లు ఉన్నాయని అన్నారు. వీటిపై ముందుగా ఫ్లై ఓవర్లు వేయిస్తామన్నారు. ఫ్లై ఓవర్ల పైన మెట్రో ప్రాజెక్టు నిర్మాణం ఉండనుదని తెలిపారు.  స్థానిక ఎమ్మెల్యేల విజ్ణప్తి మేరకు డీపీఆర్(DPR) చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ఒకటన్నారు. మెట్రో రాకతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విశాఖ వాసుల కల నెరవేరనుందని అన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా రవాణా రంగంలోనే విశాఖకు ఓ నూతన శకం ఆరంభం అవబోతోందని అన్నారు. మెట్రో రైలు రావడం వెనక చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కృషి మరిచిపోలేనిదన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×