E-Paper
Advertisement

Nellore Rural: కోటం రెడ్డి ఫ్లెక్సీ తొలగింపు.. కార్పొరేటర్‌కు బెదిరింపులు

Nellore Rural: కోటం రెడ్డి ఫ్లెక్సీ తొలగింపు.. కార్పొరేటర్‌కు బెదిరింపులు
Advertisement

Nellore Rural: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నెల్లూరు రూరల్ వైసీపీ అధ్యక్షుడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. ఈక్రమంలో పడారుపల్లి కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి ఆదాలకు మద్ధతు ప్రకటించి తన ఆఫీసులోని కోటంరెడ్డి ఫ్లెక్సీలను తొలగించాడు.

దీంతో మళ్లీ వివాదం రాచుకుంది. తన ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయభాస్కర్‌ రెడ్డిపై బెదిరింపులకు పాల్పడ్డారు. కోటం రెడ్డి అనుచరులు తన ఇంటికొచ్చి భయపెట్టారని విజయభాస్కర్ రెడ్డి ఆరోపించారు. కోటంరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

Advertisement

ఇక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పెద్దలే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. దీంతో కోటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం అతని స్థానంలో నెల్లూరు రూరల్ వైసీపీ అధ్యక్షుడిగా ఆధాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది. రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ తరుపున ఆదాలనే పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ఱారెడ్డి కూడా ప్రకటించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×