E-Paper
Advertisement

తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నారా? కొడుక్కి ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు, కోర్టు సమర్థన

తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నారా? కొడుక్కి ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు, కోర్టు సమర్థన
Advertisement

Mother Gift Cancel:  జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ కుమారులు లేదా కూతుళ్లకు బాధ్యత ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ బాధ్యతను విస్మరించిన వారు ఆస్తిని పొందే హక్కు లేదని క్లారిటీ ఇచ్చింది. సరిగ్గా నిర్లక్ష్యానికి గురైన 80 ఏళ్ల తల్లి.. కొడుకుకు బహుమతిగా ఇచ్చిన ఆస్తి రద్దును సమర్థించింది న్యాయస్థానం. అసలు ఏం జరిగింది?

తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నారా? కొడుక్కి ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు

Advertisement

ఈ మధ్యకాలంలో తల్లిదండ్రుల ఆస్తులను రాయించుకుంటున్నారు వారి పిల్లలు. అప్పటివరకు బాగా చూస్తామని చెప్పినవాళ్లు, ఆస్తి రాసి ఇచ్చిన తర్వాత ముఖం చాటేస్తున్నారు. పోషించేవారు లేక రోడ్డున పడుతున్నారు తల్లిదండ్రులు. ఈ తరహా ఉదంతాలు చాలానే ఉన్నాయి. 80 ఏళ్ల తల్లి.. తన కొడుకుకు బహుమతిగా ఇచ్చిన ఆస్తి రద్దు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సమర్థించింది.

ఏకైక కొడుకు సంక్షేమం, జీవనోపాధిని సురక్షితం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రేమ, ఆప్యాయతలతో స్వచ్ఛందంగా ఆస్తి బదిలీ చేసింది ఓ తల్లి. ఆస్తి పొందిన తర్వాత అతను ఆమెకు సంరక్షణ అందించడంలో విఫలమయ్యాడని న్యాయస్థానం పేర్కొంది. దీనిపై ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేశాడు కొడుకు.

Advertisement

80 ఏళ్ల వృద్ధురాలికి న్యాయం చేసి కోర్టు

దీనిపై పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, వయో వృద్ధులను నిర్లక్ష్యం చేసినప్పుడు తల్లిదండ్రుల పోషణ-సంక్షేమ చట్టం కింద ట్రిబ్యునల్స్ అలాంటి బదిలీలను రద్దు చేయవచ్చని తీర్పు ఇచ్చారు.  పిటిషనర్ తల్లి 80 ఏళ్ల వృద్ధురాలు. 2011 ఏడాదిలో పిటిషనర్‌కు అయిన కొడుక్కి బహుమతి కొంత ఆస్తి రాసి ఇచ్చింది.

అందులోని వివరాల మేరకు ఏకైక కుమారుడి సంక్షేమం, జీవనోపాధిని భద్రపరచాలనే ఉద్దేశ్యంతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఆస్తిని బదిలీ చేసినట్టు జూన్ 25న కోర్టు ప్రస్తావించింది. తల్లి అనారోగ్యం సమయంలో కొడుకు ఏ మాత్రం పట్టించుకోలేదు. తల్లికి కోవిడ్, బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చింది. అయినా కొడుకు ఏ మాత్రం పట్టించుకోలేదు.

ALSO READ: ఏపీ అడవుల్లో ‘రాయల్’ గర్జన.. పవన్ కల్యాణ్ చొరవతో మహారాష్ట్ర నుంచి రెండు ఆడ పులుల రాక!

ఫలితంగా ఉపశమనం కోరుతూ తల్లిదండ్రులు-సీనియర్ సిటిజన్ల నిర్వహణ- మరియు సంక్షేమ చట్టం, 2007లోని సెక్షన్ 4(1) కింద ట్రిబ్యునల్ ముందు ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. పిటిషనర్ తన ఆస్తిని తీసుకున్నారని, తన అవసరాలను పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారులు తగిన చర్య తీసుకోవాలని అందులో ప్రస్తావించింది.

దీనిపై విచారణ జరిపిన అధికారులు..  సదరు మహిళ ప్రస్తుతం తన చిన్న కూతురు వద్ద ఉన్నట్లు ట్రిబ్యునల్ గమనించింది. ఆమెకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. 2011లో తన పూర్వీకుల భూమిని పిటిషనర్ కొడుక్కి బదిలీ చేసింది. తాను రాచ్చిన ఆస్తి పత్రాన్ని రద్దు చేసి, తిరిగి తన ఆస్తిని అప్పగించాలని కోరింది. కుమార్తె తన వైద్య ఖర్చులు, ఇతర అవసరాలను చూసుకుంటోందని, భవిష్యత్తులో ఆమెకు మద్దతు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిందని తెలిపింది ట్రిబ్యునల్.  దీన్ని హైకోర్టు సమర్థించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×