E-Paper
Advertisement

Nara Rammurthy Nayudu: రేపు రామ్మూర్తి నాయుడు అంత్య‌క్రియ‌లు.. తమ్ముడిని చూసి చంద్ర‌బాబు భావోద్వేగం

Nara Rammurthy Nayudu: రేపు రామ్మూర్తి నాయుడు అంత్య‌క్రియ‌లు.. తమ్ముడిని చూసి చంద్ర‌బాబు భావోద్వేగం
Advertisement

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఇప్పటికే చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి, లోకేష్ ఆసుపత్రికి చేరుకోగా తాజాగా సీఎం చంద్రబాబు సైతం ఆస్పత్రికి వచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.

రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉదయం 5 గంటలకు ప్రత్యేక విమానంలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని రేణిగుంట విమానాశ్ర‌యానికి తీసుకువెళ్ల‌నున్నారు. అక్కడి నుండి నారావారిపల్లికి త‌రలిస్తారు. ఇదిలా ఉండగా రామ్మూర్తి నాయుడు గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చేర్పించగా మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 1994 నుండి 1999 వరకు రామ్మూర్తి నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు.

Advertisement

ఆయనకు భార్య ఇందిర‌, ఇద్దరు కుమారులు ఉన్నారు. రామ్మూర్తి నాయుడు తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో నాటకాలపై ఉన్న ఆసక్తితో స్నేహితులతో కలిసి నాటకాలు వేసేవారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ గా పనిచేశారు. అనంతరం చంద్రబాబుకు రాజకీయాల్లో అండగా ఉండేవారు. 1992లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అక‌స్మాత్ముగా ఆయ‌న చ‌నిపోవ‌డంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×