E-Paper
Advertisement

Minister Lokesh: ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్ ఎందుకన్నారు?..భోగాపురం క్రెడిట్ పై వైసీపీకి లోకేశ్ పంచ్

Minister Lokesh: ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్ ఎందుకన్నారు?..భోగాపురం క్రెడిట్ పై వైసీపీకి లోకేశ్ పంచ్
Advertisement

Minister Lokesh: “2019 లో టీడీపీ ఓటమి పాలైనప్పుడు.. నాపై వ్యక్తిగతం తప్పుడు వార్తలు రాశారు. నేను విశాఖ వచ్చినప్పుడు లాంజ్ లో స్నాక్స్ కోసం సుమారు రూ.25 లక్షల బిల్లు అయిందని తప్పుడు వార్తలు రాశారు. చిన్న బాబు చిరు తిండికి రూ.25 లక్షలు అనే టైటిల్ తో నా ఫొటో పెట్టి నా దుష్ప్రచారం చేశారు. అప్పటి నుంచి ఆ పేపర్ పై న్యాయ పోరాటం చేస్తున్నాను. ఎవరిపైనైనా వార్త రాసే ముందు వారి అభిప్రాయం తీసుకోని రాయడం, వివరాలు క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలా చేయకుండా.. నన్ను కించపరిచే విధంగా ఆనాడు ఆర్టికల్ రాశారు. దానిపై నేను పోరాడుతున్నాను. ఈ కేసులో ఇప్పటి వరకూ నేను ఏడుసార్లు కోర్టుకు వచ్చాను”- మంత్రి లోకేశ్

“ది వీక్ అనే ఆంగ్ల మ్యాగజైన్ వాళ్లు కూడా ఈ ఆర్టికల్ వేస్తే వాళ్లకు కూడా నోటీసులు పంపాను. ఏ రోజుల్లో నేను ఖర్చు చేశానని చెప్పారో.. ఆ సమయంలో నేను విశాఖలో లేనని నిరూపించాను. దానికి వాళ్లు క్షమాపణలు కూడా కోరారు. గతంలో, ఇప్పుడు కూడా నేను విశాఖ వచ్చినప్పుడు టికెట్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవడంలేదు, ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఉండడంలేదు. నేను వాడే రెండు వాహనాలు కూడా నా సొంత వాహనాలు. వాటి డిజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్, చివరికి కాఫీ కూడా, కాఫీ కప్పు, పౌడర్, కూడా నాదే. ఇది నా తల్లి నాకు నేర్పని సంస్కృతి.

Advertisement

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు మనపై పెద్ద బాధ్యత పెట్టారు. మా ఖర్చులను కుటుంబపరంగా మేమే భరిస్తు్న్నాం. నేను గతంలోనే చెప్పాను.. ఇంట్లో అమ్మ, బ్రాహ్మణి సంపాదిస్తే.. నేను, బాబు గారు ఖర్చు పెడుతున్నామని చెప్పాను. నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా వాళ్లే కడుతున్నారు. నేను ప్రభుత్వ పనులపై విశాఖ వచ్చినా నా సొంత డబ్బులే ఖర్చు చేస్తున్నాను. ఒక క్రమశిక్షణతో రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే తప్పుడు వార్తలపై పోరాడాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎన్నేళ్లు పట్టినా ఈ కేసులో విజయం నాదే”- మంత్రి లోకేశ్

విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదు

“రూ.14 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం. విశాఖ ఉక్కు కోసం ఎన్డీఏ ప్రభుత్వ కట్టుబడి ఉంది. ఆనాడు వాజిపేయ్, చంద్రబాబు కలిసి విశాఖ ఉక్కును కాపాడారు. నేడు మోదీ, చంద్రబాబు కలిసి విశాఖ ఉక్కును కాపాడుతున్నారు. విశాఖ ఉక్కుపై ఎలాంటి అపోహలు వద్దు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు. జరగనివ్వం. విశాఖ ఉక్కును లాభాల్లో నడవాలని కోరుకుంటున్నాం”- మంత్రి లోకేశ్

భోగాపురం క్రెడిట్ తీసుకోమనండి.. అలాగే

Advertisement

“భోగాపురం క్రెడిట్ కోసం ఎవరూ పోరాడడం లేదు. ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కోసమే మా తాపత్రయం. గతంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్టు అవసరమా? అన్నారు. గతంలో 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం జీఎంఆర్ అందించింది. అది చాలా తక్కువ. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు 5 వేల ఎకరాలు కేటాయించారు. ఆనాడు వీళ్లు ఎయిర్ పోర్టుకు 5 వేల ఎకరాలు ఎందుకన్నారు. రాబోయే 100 ఏళ్లకు సరిపడా భూమి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు అందుబాటులో ఉంది.

చంద్రబాబు ఒక విజన్ తో ఆ ఆలోచన చేశారు. జగన్ హయాంలో భోగాపురానికి ఇచ్చిన 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ 600 ఎకరాలు మళ్లీ కేటాయించింది. ఎందుకంటే.. ఎయిర్ పోర్ట్ అంటే విమానాల ల్యాండింగ్ ఒకటే కాదు.. దాని చుట్టూ ఉపాధి అవకాశాలను కూడా డెవలప్ చేస్తున్నాం. భోగాపురం క్రెడిట్ కావాలంటే వైసీపీని తీసుకోమనండి.. దాంతో పాటు పీపీఏలను రద్దు చేశామని క్రెడిట్ తీసుకోమనండి, అమర్ రాజాను ఏపీ నుంచి తరిమేశామని క్రెడిట్ తీసుకోమనండి”- మంత్రి లోకేశ్ 

Also Read:  ‘చిన్నబాబు’ ఫీవర్.. ఆ వైసీపీ కీలక నేత అరెస్టు తప్పదా?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×