E-Paper
Advertisement

Nara Lokesh : లోకేశ్ భలే మాట్లాడారే.. మోదీ మెచ్చుకోవాల్సిందే…

Nara Lokesh : లోకేశ్ భలే మాట్లాడారే.. మోదీ మెచ్చుకోవాల్సిందే…
Advertisement

Nara Lokesh : అమరావతి నమో నమః అంటూ సింపుల్‌గా స్పీచ్ స్టార్ట్ చేశారు నారా లోకేశ్. ఆ తర్వాత స్పీడ్ పెంచారు. పంచ్ డైలాగులతో ఇరగదీశారు. పాకిస్తాన్‌‌పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. లోకేశ్ స్పీచ్ నెవ్వర్ బిఫోర్ అంటూ అన్నివర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

100 పాకిస్తాన్‌లు వచ్చినా..

Advertisement

పాకిస్తాన్ గీత దాటింది.. చాలా పెద్ద తప్పు చేసింది.. 100 పాకిస్తాన్‌లు వచ్చినా.. గడ్డి కూడా పీకలేరు.. ఎందుకంటే మన దగ్గర తిరుగులేని వెపన్ ఉంది.. ఆ వెపన్.. నమో మిస్సైల్.. పాకిస్తాన్‌ పాలిట సింహం.. మన నరేంద్ర మోదీ.. అంటూ నారా లోకేశ్ పవర్‌ఫుల్‌గా మాట్లాడారు. నమో దెబ్బకు పాకిస్తాన్‌కు దిమ్మ తిరిగడం ఖాయం.. ఇప్పటికే పాక్ ఆర్మీ అధికారులు రాజీనామాలు చేస్తున్నారని గుర్తు చేశారు.

ఏపీపై మోదీకి ప్రేమ

Advertisement

ఇటీవల కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయం కేవలం నిర్ణయం మాత్రమే కాదని అదో సంచలనం అన్నారు నారా లోకేశ్. ఢిల్లీలో బిజీగా ఉన్నా.. అమరావతి కోసం తరలి వచ్చారన్నారు. మోదీకి ఆంధ్రప్రదేశ్ అన్నా, అమరావతి అన్నా చాలా ప్రేమని చెప్పారు. ప్రధాని మోదీ ఏపీ కోరికలన్నీ తీరుస్తున్నారని చెప్పారు. ‘విశాఖ ఉక్కును కాపాడారు.. రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి డ్రగ్ పార్క్ కు నిధులు కేటాయించారు.. ఇప్పుడు అమరావతిని ప్రారంభిస్తున్నారు’.. అని నారా లోకేశ్ కొనియాడారు.

ఆ దమ్ము ఎవరికీ లేదు..

అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదని.. మన గుండెల్లో దాచుకున్న రాజధానిని అని లోకేశ్ అన్నారు. రైతులపై ఎన్ని అరాచకాలు చేసినా.. ఇక్కడి వాళ్లు తగ్గేదేలే అన్నారని గుర్తు చేశారు. నమో శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపే దమ్ము ఎవరికీ లేదని తేల్చి చెప్పారు నారా లోకేశ్.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×