E-Paper
Advertisement

YCP Jogi Ramesh – TDP Leaders: జోగితో టీడీపీ జోడీ.. ఖంగుతిన్న అధిష్టానం.. సైలెంట్ మోడ్ లో ఆ ఎమ్మెల్యేలు!

YCP Jogi Ramesh  – TDP Leaders: జోగితో టీడీపీ జోడీ.. ఖంగుతిన్న అధిష్టానం.. సైలెంట్ మోడ్ లో ఆ ఎమ్మెల్యేలు!
Advertisement

YCP Jogi Ramesh – TDP Leaders: రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు.. మిత్రులు కూడా ఉండరని చెబుతుంటారు. అదే ఇది.. ఇదే అది. మొన్నటి వరకు ఆ నేత అంటే టీడీపీ శ్రేణులకు కోపతాపాలు ఎక్కువే. కానీ ఉన్నట్లుండి ఆ నేతతో జతకట్టి తిరిగారు టీడీపీ నాయకులు. నాయకులు అంటే నాయకులు కాదండీ.. ఏకంగా టీడీపీ ఎమ్మేల్యేలు. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వ కాలంలో మంత్రి హోదాలో గల ఈ నేత ఇప్పుడు పొలిటికల్ టాక్ ఆఫ్ ది టాపిక్ గా నిలిచారు. అసలు ఆ నేత సంగతి ఏంటో తేల్చాలని మంత్రి నారా లోకేష్ కూడా ఆదేశించారట.

జోగి రమేష్ అంటే తెలియని ఎవరూ ఉండరు. ఈయన వైసీపీ హయాంలో మంత్రిగా కూడా కొనసాగారు. అంతేకాదు ఏకంగా మంగళగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడింది కూడా ఈయనేనంటూ.. ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఈయన పేరెత్తితే చాలు, టీడీపీ అధినాయకత్వం గుర్రుమనేది. మొన్నటి వరకు జోగి రమేష్ అంటే కథ ఇలా ఉండేది. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉందట.

Advertisement

నిన్న నూజివీడులో జరిగిన స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. వారితో పాటు జోగి రమేష్ కూడా అక్కడ కనిపించారు. అసలే జోగి రమేష్ పేరెత్తితే భగ్గుమనే టీడీపీ నేతల వెంట జోగి రమేష్ పాల్గొనడం ఇప్పుడు టీడీపీ అధినాయకత్వానికి అంతగా రుచించడం లేదట. ఈ విషయం చిన్నగా నారా లోకేష్ దృష్టికి కూడా పోగా, అసలు ఏం జరిగింది? ఎందుకు జోగి రమేష్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారనే విషయాలను లోకేష్ ఆరా తీస్తున్నారట.

Also Read: Joy Jemima Honey Trap Case: నీ కోసం ఏదైనా చేస్తా.. జడ్జీని కొనేద్దాం! హనీ ట్రాప్‌లో బీజేపీ నేత..

Advertisement

ఇటీవల వైసీపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు టీడీపీ, జనసేన పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. అయితే జోగి రమేష్ కూడా టీడీపీలో చేరడం ఖాయమని, అందుకే ఎమ్మేల్యేల వెంట ఉన్నారని వదంతులు వ్యాపించాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జోగి రమేష్ మాట.. తూటాలేనని చెప్పవచ్చు. అటువంటి రమేష్ ను పార్టీలోకి తీసుకుంటారని వదంతులు వ్యాపించడంపై టీడీపీ అధినాయకత్వం సీరియస్ అయిందట. ఇంతకు జోగి రమేష్ పార్టీ మారితే, వైసీపీకి షాక్ ఏమోగానీ, టీడీపీ క్యాడర్ కి మాత్రం భారీ షాక్ అని చెప్పవచ్చు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×