E-Paper
Advertisement

Nara Lokesh: మద్యం మత్తులో యువకుల వీరంగం.. లోకేష్ సీరియస్ యాక్షన్

Nara Lokesh: మద్యం మత్తులో యువకుల వీరంగం.. లోకేష్ సీరియస్ యాక్షన్
Advertisement

Nara Lokesh: భీమవరంలో కొంతమంది ఆకతాయిలు ప్రతి రోజూ రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వారు చేస్తున్న ఆగడాలకు అంతులేకుండాపోతోంది.  గురువారం సాయంత్రం నారాయణ కాలేజీ భీమవరం వన్‌టౌన్ సీఎమ్‌ఆర్ వద్ద.. నారాయణ కాలేజీ బస్సులో విద్యార్ధినిని కొట్టి, దుర్భాషలాడి, రోడ్డుపై వీరంగం సృష్టించారు. బస్సులో వెళ్తున్న నన్ను ఎందుకు కొట్టావ్ అని ఆ విద్యార్ధి ప్రశ్నించగా.. విద్యార్ధినిపై దాడికి దిగారు ఆకతాయిలు. విద్యార్ధి బస్సు ఎక్కి వెళ్లిపోయినా.. ఆకతాయిలు మాత్రం బస్సును వెంబడించి, నడిరోడ్డుపై విద్యార్ధులను వెకిలి సేష్టలు చేస్తూ రెచ్చిపోయారు.

యువకులు సృష్టించిన అలజడికి వాహానదారులు ఆందోళనకు దిగారు. యువకులు మద్యం మత్తులో నిత్యం అలజడి సృష్టిస్తున్నారని స్కూల్స్, కాలేజీలకు విద్యార్ధినులు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అక్కడ ఉన్న సీసీకెమరాలో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: ఈతరానికి ఏం నేర్పుతున్నావ్ జగన్? రప్పా రప్పా.. కాస్త ఆలోచించప్పా!

భీమవరంలో విద్యార్ధులపై దాడి చేసిన వారిపై.. చర్యలు తీసుకోవాలి మంత్రి నారా లోకేష్ డీజీపీని ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో.. పట్టపగలు విద్యార్ధులపై అరాచక వ్యక్తులు దాడి చేసిన సంఘటన.. తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పౌర సమాజంలో ఇటువంటి ప్రవర్తన.. ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఈ చర్యను సహించదని ఉద్ఘాటించారు. ఇది సభ్య సమాజానికి ఏమాత్రం అంగీకరించలేంది. నిందులతులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ వివరించారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×