E-Paper
Advertisement

టీడీపీలో కీలక మార్పులు.. పార్టీ ఉపాధ్యక్షుడిగా నారా లోకేష్, జాతీయ కార్యదర్శిగా రామ్మోహనాయుడు

టీడీపీలో కీలక మార్పులు.. పార్టీ ఉపాధ్యక్షుడిగా నారా లోకేష్, జాతీయ కార్యదర్శిగా రామ్మోహనాయుడు
Advertisement

Amaravati: వచ్చే ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీని ఇప్పటి నుంచి యువ సైన్యాన్ని రెడీ చేస్తున్నారు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్, జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్ నాయుడులను నియమించింది. ఇదే కాకుండా పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది టీడీపీ హైకమాండ్.

తెలుగుదేశ పార్టీలో కీలక మార్పులు

Advertisement

ఎట్టకేలకు టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్ హైకమాండ్ ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌ని నియమించింది. ఇప్పటివరకు జాతీయ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ స్థానంలోకి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు చోటు కల్పించింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు.

పార్టీలో పదవుల్లో సీనియర్లకు గౌరవం ఇస్తూనే కొత్తవారికి అవకాశాలు ఇచ్చామని పేర్కొన్నారు. సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు చేశామని తెలిపారు. పార్టీకి విధేయత, కష్టపడే తత్వం, అనుభవం ఆధారంగా పదవులను ఇచ్చినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

పార్టీ ఉపాధ్యక్షుడిగా నారా లోకేష్, జాతీయ కార్యదర్శిగా రామ్మోహనాయుడు

తొలుత నామినేటెడ్ పదవుల కోసం చాలామంది నేతలు పోటీ పడ్డారు. అందులో అవకాశాలు రానివారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేస్తామని గతంలో అధినేత చంద్రబాబు చెప్పారు. అనుకున్నట్లుగానే పొలిట్ బ్యూరోలో మార్పులు చేశారు. మొత్తం 29 మందితో ఆ పార్టీ పొలిట్ బ్యూరోని ఏర్పాటు చేసింది. అందులో ఏపీతోపాటు తెలంగాణ వారికి చోటు కల్పించింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని నియమించింది.

టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌కు ప్రమోషన్ లభించింది. పొలిట్ బ్యూరోలో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు, లావు శ్రీకృష్ణదేవరాయులు ఉండనున్నారు. పార్టీ జాతీయ కోశాధికారిగా కొనకళ్ల నారాయణ నియమితులయ్యారు.  జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గుర్ని ఎంపిక చేసింది టీడీపీ హైకమాండ్. వారిలో రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలారులకు చోటు కల్పించింది.

ALSO READ: ఏపీలో ఇంటర్ ఫలితాలు-2026: బాలికలదే పైచేయి, ఫస్టియర్‌లో 77 శాతం, సెకండియర్‌లో 81 శాతం ఉత్తీర్ణత

అన్ని జిల్లాల నేతలకు చోటు కల్పించింది. 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీలను నియమించింది. జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందికి చోటు దక్కింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కంటిన్యూ కానున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఏడుగుర్ని ఎంపిక చేసింది.  గౌతు శిరీష, చింతకాయల విజయ్, అశోక్‌బాబు, దేవినేని ఉమ, పాశం సునీల్ కుమార్, ముఖ్తియార్, అమర్‌నాథ్ లకు చోటు కల్పించింది.

మండల పార్టీ అధ్యక్షురాలికి, ఓ క్లస్టర్ ఇన్‌చార్జికి నేరుగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు అధినేత చంద్రబాబు. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్‌చార్జి ధనుంజయ్ చోటు కల్పించారు. ఇక రాష్ట్ర కమిటీలో 185 మందిలో 50 మంది మహిళలకు చోటు దక్కింది. పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించింది టీడీపీ.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×