// //

Nara Bhuvaneswari : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆమె ఓదారుస్తున్నారు. తాజాగా జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో టీడీపీ కార్యకర్త పడాల వీరబాబు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత మనో వేదనకు గురై మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి ఆర్థికంగానూ ఆదుకుంటున్నారు. పడాల వీరబాబు ఫ్యామిలీకి రూ.3లక్షల చెక్కును అందించారు. తుని, కాకినాడ నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. గురువారం పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. శుక్రవారం అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల్లో బాధిత కుటుంబాలను భువనేశ్వరి ఓదార్చుతారు.