E-Paper
Advertisement

Anantapur: రేయ్.. మీరు మనుషులా..? కుక్కలా..? మరీ ఆ ప్లేస్‌లో అలా కొరకవచ్చా..!

Anantapur: రేయ్.. మీరు మనుషులా..? కుక్కలా..? మరీ ఆ ప్లేస్‌లో అలా కొరకవచ్చా..!
Advertisement

Anantapur: సాధారణంగా కుక్కలు మనుషులను కరవడం మనం చూస్తుంటాం. కానీ.. తన కుక్కను తిట్టాడన్న కోపంతో ఒక మనిషే మరో మనిషిని కుక్కలా మారి వేటాడిన అమానుష ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం కాస్తా ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. నిందితుడు బాధితుడి మర్మాంగాన్ని నోటితో కొరికి తీవ్రంగా గాయపరచడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

నల్లమడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన పోతుల కుళ్లాయప్ప ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే.. ఆ కుక్క తరచూ ఎదురింట్లో నివసించే గోపాల్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి చెప్పులు కొరకడం అక్కడ ఉన్న చిన్నపిల్లలను భయపెట్టడం చేస్తోంది. దీనిపై గోపాల్ స్పందిస్తూ.. ‘నీ కుక్క మా ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పెడుతోంది. కట్టడి చేసుకో’ అని కుళ్లాయప్పను ప్రశ్నించాడు. తన కుక్కను అంటావా అంటూ కుళ్లాయప్ప ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు.

Advertisement

మాటా మాట పెరగడంతో కుళ్లాయప్ప తన విచక్షణను కోల్పోయాడు. గోపాల్‌పై భౌతిక దాడికి దిగాడు. ఈ క్రమంలో కుళ్లాయప్ప తండ్రి పోతులయ్య కూడా కొడుకుకు వత్తాసు పలికాడు. గోపాల్ ఎటూ కదలకుండా పోతులయ్య కాళ్లు గట్టిగా పట్టుకోగా, కుళ్లాయప్ప ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఏకంగా గోపాల్ మర్మాంగం పై నోటితో దాడి చేసి పిచ్చి కుక్కలా కొరికాడు. ఈ దాడి ఎంత భయంకరంగా సాగిందంటే..  గోపాల్ మర్మాంగం భాగంలో చర్మం పూర్తిగా ఊడిపోయి తీవ్ర రక్తస్రావమైంది.

తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న గోపాల్‌ను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం మరియు పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం బాధితుడు అక్కడ మృత్యువుతో పోరాడుతున్నాడు.

Advertisement

ఈ దారుణ ఘటనపై బాధితుడు గోపాల్ కుమారుడు నల్లమడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కుళ్లాయప్పను అదుపులోకి తీసుకున్నారు. “కుక్క కంటే యజమానే భయంకరంగా ప్రవర్తించాడు” అని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. పెంపుడు జంతువుల మీద ప్రేముండొచ్చు కానీ, అది తోటి మనిషి ప్రాణాలు తీసేంత ఉన్మాదంగా మారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: Tamil Nadu: తండ్రికి రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్.. పాముకాటుతో చంపి.. ఎలా దొరికారంటే..?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×