E-Paper
Advertisement

Nagababu: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ నాగబాబు.. కోవా బన్ వ్యాపారికి రూ. 25వేల ఆర్థిక సాయం!

Nagababu: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ నాగబాబు.. కోవా బన్ వ్యాపారికి రూ. 25వేల ఆర్థిక సాయం!
Advertisement

Nagababu: కర్నూలుకు చెందిన వలీ, మేడారం జాతరలో చిన్న బండిపై కోవా బన్ను అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఒక సాధారణ వ్యాపారి. ఇటీవల కొన్ని యూట్యూబర్లు అతని వ్యాపారంపై అనుమానాలు రేకెత్తించేలా ప్రవర్తించడంతో వైరల్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ రేపింది. నెటిజన్లు, లైకులు, షేర్ల కోసం చిరు వ్యాపారులపై వంచనాత్మకంగా ప్రవర్తించడం తగదు అని ఆ యూట్యూబర్లను విమర్శించారు.

వలీకి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు వ్యక్తమైంది. రాజకీయ, సినీ ప్రముఖులు నారా లోకేశ్, పరిటాల లోకేశ్, అసదుద్దీన్ ఒవైసీ తదితరులు అతనికి మద్దతు తెలిపారు. తాజాగా ఏపీ ఎమ్మెల్సీ, సినీ నటుడు నాగబాబు వలిని కలిశారు. ధైర్యం చెప్పి వ్యక్తిగతంగా 25వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. నాగబాబు మాట్లాడుతూ.. ‘చిరువ్యాపారులు పొట్టకూటి కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం తక్కువ లాభంలో వ్యాపారం చేస్తున్నారు. వారిపై భయభ్రాంతులు రేపడం మంచిదే కాదు. వారి వ్యాపార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నారు. ఏదైనా సందేహం ఉంటే అధికారులను సంప్రదించవచ్చు. వలీ లాంటి చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం మద్దతుగా ఉంటుంది’ అన్నారు.

Advertisement

ఇందులో తక్కువ మూలధనతో.. ఎక్కువ జనసంద్రంలో రోజువారీ ఖర్చులు తీర్చుకునే లక్ష్యంతో చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని.. సౌకర్యవంతమైన ఆహార పదార్థాలను విక్రయించే కోట్లాది ప్రజలు ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 40% పేద ప్రజలు ఈ వ్యాపారాల మీద ఆధారపడతారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ సంఘటనను మతం కోణంలో చూడకూడదని.. సాధారణ పౌరుడి కష్టాన్ని అర్థం చేసుకోవాలని నాగబాబు హితవచనం ఇచ్చారు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి.. గమ్యస్థానానికి చేరకముందే అనంత లోకాలకు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×