E-Paper
Advertisement

Mylavaram: ముహూర్తం వేళ ట్విస్ట్.. తాళి కట్టే లోపే మండపం దిగిన పెళ్లికూతురు.. షాక్‌లో వరుడు!

Mylavaram: ముహూర్తం వేళ ట్విస్ట్.. తాళి కట్టే లోపే మండపం దిగిన పెళ్లికూతురు.. షాక్‌లో వరుడు!
Advertisement

Mylavaram: పెళ్లి మండపం నిండా బంధుమిత్రుల కోలాహలం.. ఒకవైపు మంగళ వాయిద్యాలు, మరోవైపు వేద మంత్రాల ఉచ్చారణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సరిగ్గా సుముహూర్త సమయానికి వధూవరుల తలపై జీలకర్ర-బెల్లం పెట్టారు. ఇక మరికొన్ని నిమిషాల్లో మాంగల్య ధారణ జరుగుతుందనగా.. అక్కడ జరిగిన ఒక ఊహించని పరిణామం అందరినీ నివ్వెరపోయేలా చేసింది.

సీన్ రివర్స్.. పీటలపై నుంచి లేచి.. ప్రియుడి చెంతకు!
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. వరుడి ఇంటి వద్ద శుక్రవారం రాత్రి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. శాస్త్రోక్తంగా జీలకర్ర-బెల్లం కార్యక్రమం పూర్తయ్యాక, తాళి కట్టే సమయానికి ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఒక యువకుడు హడావుడిగా మండపం వద్దకు చేరుకున్నాడు. అతడిని చూడగానే వధువు ముఖంలో స్పష్టమైన మార్పు కనిపించింది.

Advertisement

“వచ్చావా” అంటూ పీటల మీద నుంచి లేచిన పెళ్లికూతురు, మండపం దిగి నేరుగా ఆ యువకుడి పక్కన నిలబడింది. ఈ హఠాత్పరిణామానికి వరుడు, పురోహితులు, అక్కడ ఉన్న బంధువులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

రంగంలోకి పోలీసులు.. తలకిందులైన ఏర్పాట్లు
“ఇతను మా ఊరి అబ్బాయి.. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు” అంటూ వధువు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో మండపంలో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన కొందరు బంధువులు యువకుడిపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడంతో గలాటా మొదలైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగించారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెళ్లి నిలిచిపోయింది.

Advertisement

లక్షల ఖర్చు.. ఆవిరైన కలలు
వరుడి తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. “మాకు ఉన్నది ఒక్కడే కుమారుడు. ఎన్నో ఆశలతో రూ. 20 లక్షలు ఖర్చు చేసి వివాహాన్ని ఘనంగా తలపెట్టాం. వేల మందికి విందు భోజనాలు ఏర్పాటు చేశాం. అందరి ముందు మా పరువు తీసేశారు” అని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read: రాయదుర్గంలో ఆనాడు తప్పు చేశా.. సీఎం చంద్రబాబుకు డీఎల్ఎఫ్ సంస్థ హామీ

పంచాయితీతో ముగింపు
శనివారం ఉదయం ఇరువర్గాల వారు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించుకున్నారు. జరిగిన నష్టానికి సంబంధించి, తలెత్తిన వివాదాలను పెద్దల సమక్షంలో చర్చించి పరిష్కరించుకున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో వధువు తీసుకున్న నిర్ణయం ఆ ఊరిలో పెద్ద సంచలనంగా నిలిచింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×